Varun Tej Ghani Release Postponed: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' సినిమా మరోసారి వాయిదా పడక తప్పలేదు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 25న గని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ అదే రోజున విడుదలవుతుండటంతో గని వాయిదా పడక తప్పలేదు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్ చిత్రాలు వాయిదా పడగా.. తాజాగా గని కూడా ఆ జాబితాలో చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గని సినిమా విడుదలను వెనక్కి జరిపినట్లు తాజాగా ఆ సినిమా మేకర్స్ ట్విట్టర్‌లో ప్రకటించారు. 'గనిపై మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషం. మీ ప్రోత్సహమే ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ నెల 25న భీమ్లా నాయక్ విడుదల కారణంగా గని విడుదలను వెనక్కి జరుపుతున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌గా భీమ్లా నాయక్ కోసం తాము ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం.' అని మేకర్స్ వెల్లడించారు. 


నిజానికి ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న గని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇటీవలే ఫిబ్రవరి 25ని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. అయితే ఇంతలో భీమ్లా నాయక్‌ సినిమాను కూడా అదే రోజున విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. దీంతో గని మేకర్స్ డైలామాలో పడ్డారు. భీమ్లా నాయక్‌తో పోటీపడి రిలీజ్‌కు వెళ్లడం కంటే.. విడుదలను కాస్త వెనక్కి జరపడమే బెటర్ అని భావించారు. దీంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పలేదు. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్, తాజాగా గని.. ఈ మూడు సినిమాలు వాయిదా పడటంతో భీమ్లా నాయక్ సోలోగా థియేటర్లపై దండెత్తనున్నాడు.


గని సినిమా విషయానికొస్తే.. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి మంజ్రేకర్ నటించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Also Read: Bandla Ganesh Audio Leak: త్రివిక్రమ్ నన్ను రావొద్దంటున్నాడు.. 'భీమ్లా నాయక్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook