Bheemla Nayak Pre Release Event: పవన్ ఫ్యాన్స్‌కు కీలక సూచన.. ఆ పాసులు చెల్లవు.. అమల్లోకి ట్రాఫిక్ ఆంక్షలు
Bheemla Nayak Pre Release Event: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరగనున్న భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో రేపు ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Bheemla Nayak Pre Release Event: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. బుధవారం (ఫిబ్రవరి 23) జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21వ తేదీన ఇచ్చిన పాసులతో వచ్చేవారికి ఈవెంట్‌లో అనుమతి లేదని తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఇచ్చే పాసులతో వచ్చేవారికే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా :
మైత్రివనం నుంచి యూసఫ్ గూడ వైపు వాహనాలను అనుమతించరు.
సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమాగమం-కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్ళింపు
జూబ్లీహల్స్ చెక్ పోస్టు నుంచి యూసుఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగమం వైపు మళ్ళింపు
ఈవెంట్‌కు వచ్చే వాహనాలకు సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసుఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ సౌకర్యం.
భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిజానికి ఈ ఈవెంట్ సోమవారమే (ఫిబ్రవరి 21) జరగాల్సి ఉండగా ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఇంతలో భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Purchased Land On Moon: చంద్రుడిపై భూమి కొనేశాడు.. చౌక భేరం.. ఎకరం 6 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook