Surekha Vani says I will give 100 kisses to Pawan Kalyan: సురేఖా వాణి.. ఈ పేరు గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోహీరోయిన్లకు అక్క, వదిన, ఆంటీ పాత్రలు చేస్తూవెండితెరపై తనదైన నటనతో మెరిశారు. ముఖ్యంగా స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు జతగా నటించిన సినిమాలతో సురేఖా మంచి గుర్తింపు వచ్చింది. మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమలో హోమ్లీ బ్యూటీగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో సినీ అవకాశాలు తగ్గినా.. అప్పుడప్పుడూ మెరుస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సురేఖా వాణి వెండితెరపై అలరించడమే కాకుండా.. సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నారు.  ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ.. పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితల సందడి మొదలైంది. అప్పటినుంచి తల్లీకూతుళ్లు ఇద్దరు హాట్ హాట్ ఫొటోలు, డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఇద్దరు కలిసి డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అందుకే సురేఖా సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్ ఉంది.


సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై సురేఖా స్పందిస్తూ.. 'రెండో పెళ్లి చేసుకుంటున్నానని వస్తున్న వార్తలు అవాస్తవాలు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేసుకుంటే భాగా డబ్బులు ఉన్నవాడు భర్తగా రావాలి. అలానే నన్ను బాగా చూసుకోవాలి' అని చెప్పారు. సుప్రీత మాత్రం త‌న త‌ల్లికి రెండో పెళ్లి చేద్దాం అని సరదాగా అన్నారు. ఇంట్లో ఎప్పుడూ తన బుర్ర తింటుంది కాబట్టి పెళ్లి చేయాలని సుప్రీత నవ్వుతూ పేర్కొన్నారు. 


ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు వంద ముద్దులు ఇస్తారు? అని సురేఖా వాణిని అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అయితే వంద ముద్దులు ఇస్తా అని బదులిచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేపు (సెప్టెంబర్‌ 2) పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు పవన్ మేనియాతో ఊగిపోతోంది. 


Also Read: SSMB28 Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!


Also Read: నీ కన్నా విరాట్ కోహ్లీ వంద పాళ్లు నయం.. అవేశ్ ఖాన్‌పై నెటిజన్ల ఫైర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook