Pawan Kalyan: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. కాబోయే లీడర్ కి పవన్ విషెస్..!
Vijay-Pawan Kalyan: నిన్నటి నుంచి విజయ్ పార్టీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న.. చర్చ తెలిసిన విషయమే. విజయ్ నిన్న ఇచ్చిన స్పీచ్ కి అభిమానులు తెగ కేరింతలు పెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమిళంలో విజయ్.. తెలుగులో పవన్ కళ్యాణ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ విజయ్ కి విషెస్ తెలిపారు.
Vijay Party: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా రాజకీయ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ పెడుతూ ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నిలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీరు లీడర్ గా మారి ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అభినందించారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఇకపోతే తమిళ్ నాడు లో తమిళగ వెంట్రి కళగం అనే పార్టీని స్థాపించారు విజయ్.ఈ మేరకు తొలి రాష్ట్రస్థాయి మహానాడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఉన్న వి. సాలై లో ఆదివారం సభ నిర్వహించారు. ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్న ఎంతోమంది యువకులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా తరలివచ్చారు
ఉదయం నుండి అక్కడి రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. సుమారుగా 12 కిలోమీటర్ల మేరా వాహనాలు బారులు తీరగా.. విజయ్ 12 కిలోమీటర్ల మేర నడకతో సభకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ పన్నెండు కిలోమీటర్ల మేర దారి పొడవున పార్టీ జెండాలు, వస్త్రాలపై స్టిక్కర్లు, విజయ్ ఫోటోలు ఉన్న ప్లకార్డులు చేత పట్టుకొని ఆయన అభిమానులు సందడి చేశారు.. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎనిమిది లక్షల మంది ప్రజలు హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఈ కార్యక్రమం లో తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చునని కానీ పాలిటిక్స్ విషయంలో భయపడను అని విజయ్ తెలిపారు. సినీ రంగంతో పోల్చుకుంటే రాజకీయ రంగం ఎంతో సీరియస్ గా ఉంటుందని, ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై కూడా ఆయన చర్చించారు. ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తానని, తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్ళలాంటివి అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రజలకు మంచి చేకూర్చడమే తన మొదటి ప్రాధాన్యత అని తెలిపారు విజయ్.
Also Read: Free Gas Cylinder: దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter