Renu Desai Viral Post: బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఆ తరువాత మరోసారి పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాలో నటించింది. ఈ రెండు చిత్రాలలో బద్రి ఘనవిజయం సాధించగా జానీ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అప్పట్లో రేణు దేశాయికి ఎన్నో అవకాశాలు వచ్చిన పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉండడం వల్ల అవేవీ ఒప్పుకోలేదని వార్తలు కూడా వచ్చాయి. ఇక తన ప్రేమ నిజమే అంటూ కొద్ది రోజుల తర్వాత పవన్ ని పెళ్లి చేసుకుంది ఈ నటి. అయితే అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ కొద్ది సంవత్సరాల తరువాత విరిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలు అకిరా, ఆధ్యా రేణు దేశాయ్ దగ్గరే ఉండదంతో.. ఇప్పటికీ కూడా రేణు దేశాయ్ తమ వదినా అంటూ పోస్టులు పెడుతూ ఉంటారు పవన్ అభిమానులు. అంతేకాకుండా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను తరచూ ఫాలో అవుతూ ఉంటారు అభిమానులు. అందుకే రేణు దేశాయ్ ఏ పోస్ట్ పెట్టినా తెగ వైరల్ అవుతూ ఉంటుంది. 


ఈ క్రమంలో ఇప్పుడు రేణు దేశాయ్ నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తరువాత.. టిడిపి ఎమ్మెల్యే గురించి పెట్టిన ఒక స్టేటస్ తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.  తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కంగ్రాట్స్ అన్నయ్య అంటూ టిడిపి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపింది. 


ఏపీలో రేపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్.. నిన్న దాదాపు 40 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు…ఈ క్రమంలో ఆయన పోస్టర్ షేర్ చేస్తూ రేణు దేశాయ్ కంగ్రాట్స్ అన్నయ్య అని స్టేటస్ పెట్టింది. అయితే రేణు దేశాయ్ కి అసలు టిడిపి ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఎలా తెలుసు..అన్నయ్య అంటూ ఎందుకు సంబోధించింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నేటిజన్స్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.


Also read: Naralokesh: పప్పు కాదూ నిప్పు.. 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నారా లోకేష్..



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook