Vishal on Pawan Kalyan విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తాడని గత కొన్ని నెలలుగా వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశాల్ తన లాఠీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రాజకీయాల మీద కూడా స్పందించాడు. అసలే ఇప్పుడు విశాల్ సినిమాలన్నీ కూడా బోల్తా కొట్టేస్తున్నాయి. ఇలాంటి సమయంలో విశాల్ ఇక్కడి పవర్ స్టార్ అభిమానులకు నచ్చని అంశాల మీద స్పందించాడు. వారికి చేటు అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ అభిమానులు విశాల్ మీద మండి పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశాల్ తాజాగా రాజకీయాల మీద స్పందించాడు. తాను కుప్పం నుంచి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక సీఎం జగన్, పవన్ కళ్యాణ్‌ల మీద కూడా స్పందించాడు. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, అయితే ఓటు వేయాల్సి వస్తే మాత్రం కచ్చితంగా జగన్‌కే వేస్తాను అని చెప్పుకొచ్చాడు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని విశాల్ చెప్పిన మాటల మీద ఇప్పుడు జన సైనికులు మండిపడుతున్నారు.


విశాల్ లాఠీ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సినిమాలు థియేటర్లో చూడటం వేరు.. ఓటీటీలో చూడటం వేరు.. నీ సినిమాను ఐ బొమ్మలోనూ చూడటం వేస్ట్ అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విశాల్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా లాఠీ సినిమా మీద పడేట్టు కనిపిస్తున్నాయి.


అసలే ఇప్పుడు విశాల్ సినిమాలన్నీ బోల్తా పడుతూనే వస్తున్నాయి. ఎనిమి, చక్ర, అయోగ్య ఇలా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవి చూశాయి. ఇప్పుడు లాఠీ సినిమా ఇలా చిక్కుల్లో పడింది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే లాఠీ సినిమా కోసం విశాల్ బాగా కష్టపడ్డాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన సమయంలో ఎన్నో సార్లు గాయపడ్డాడు. దీంతో షూటింగ్‌లు కూడా వాయిదా పడ్డాయి.


Also Read : Gautam Ghattamaneni Birth Issue : రోజుకు గ్రా. 10 పెరగాల్సిందేనట.. గౌతమ్‌ పుట్టిన సమయంలో వచ్చిన సమస్య ఇదే.. నమ్రత ఎమోషనల్


Also Read : Pawan Kalyan Fans : మోసం చేస్తారు, వాడుకుంటారు..బండ్ల గణేష్‌ ట్వీట్లు.. మోసాన్ని బయటపెట్టేసిన పవర్ స్టార్ ఫ్యాన్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook