Pawan Kalyan Fans Unhappy about Amit Shah Inviting Jr NTR for Dinner meeting: తెలంగాణలోని మునుగోడులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి, బిజెపి అగ్ర నేత అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ సభ పూర్తయిన తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కాబోతున్నారనే అంశం టాలీవుడ్ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే అమిత్ షా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనను చూసి ఫిదా అయ్యారని ఆయన అందుకే స్వయంగా పిలిపించుకొని అభినందించాలని ఉద్దేశంతోనే డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే అంశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది. ఎందుకంటే జనసేన బీజేపీతో ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తు పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన తర్వాత కొన్ని రోజులకే జనసేన బీజేపీ రెండు పొత్తు పెట్టుకున్నాయి.


ఈ పొత్తు ఏర్పడిన దాదాపు రెండేళ్ల తర్వాత మాత్రమే అమిత్ షాను కలిసేందుకు పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ దొరికింది. ఇక మోడీతో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు మోడీని కలిసే అవకాశం దొరకలేదు. బయటకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా జనసేన బీజేపీ మధ్య పరిస్థితులు అంత బాలేవని రాజకీయ వర్గాల వారు భావిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా డిన్నర్ మీటింగ్ కు పిలవడం చర్చనీయాంశంగా మారింది.


దానికి తోడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అదే సినిమాలో నటించిన ఆయనకు అమిత్ షా  నుంచి ఆహ్వానం అందలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని హోదాలో అమిత్ షా ను కలిసేందుకు 20 నెలలు పడితే కేవలం తన పని తాను చేసుకుంటూ వెళుతున్న ఎన్టీఆర్ ని పిలిపించడం ఏమిటి? అంటూ మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్  అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక పొరపాటున భారతదేశం నుంచి ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు వెళితే కనుక దాని వెనుక అమిత్ షా హస్తం ఉందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే తమ పొత్తులో ఉన్నవారిని కలవకుండా ఇలా బయటి హీరోను పిలిపించడం ఏమీ బాలేదని వారు కామెంట్ చేస్తున్నారు. 
Also Read: Lavanya Thripathi Clarity on Marriage: వరుణ్ తో పెళ్లంటూ వార్తలు..అసలు విషయం చెప్పేసిన లావణ్య


Also Read: Pushpa The Rule Movie Launch: మెగాస్టార్ చేతుల మీదుగా పుష్ప 2 లాంచ్.. వాటికి చెక్ పెట్టడం కోసమే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి