Gabbar Singh Re Release 1st Day Collections: రీ రిలీజ్ లో పవన్ ‘గబ్బర్ సింగ్’ ఆల్ టైమ్ రికార్డు.. ఫస్ట్ డే మాస్ ఊచకోత..
Gabbar Singh Re Release 1st Day Collections: ప్రెజెంట్ టాలీవుడ్లో పాత సినిమాలను 4Kలో రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ నడుస్తోంది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కథానాయకుడిగా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
Gabbar Singh Re Release 1st Day Collections: ఈ మధ్య ఈ రీ రిలీజ్ ట్రెండ్ తగ్గినట్టు కనిపించినా.. తాజాగా మహేష్ బాబు ‘మురారి’ సినిమా మంచి వసూళ్లను రాబట్టి తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకునేలా చేసిందనే చెప్పాలి. అయితే.. ‘బ్రో’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావడానికి చాలా టైమే పట్టేలా ఉంది. అందుకే ఈ పుట్టినరోజున ‘గబ్బర్ సింగ్’ సినిమాను రీ రిలీజ్ చేసారు. ఈ రకంగా పవన్ బర్త్ డే ను గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రూపేణా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఈ సినిమా ప్రీమియర్స్ సహా ఫస్ట్ డే ఎంత రాబట్టిందనే విషయానికొస్తే..
ఈ సినిమా ప్రీమియర్స్ రూపేణా.. రూ. 30 లక్షల గ్రాస్ వసూళు చేసింది.
మరోవైపు తెలంగాణలో ..రూ. 2.82 కోట్ల గ్రాస్..
సీడెడ్ (రాయలసీమ).. రూ. 81 లక్షల గ్రాస్..
ఉత్తరాంధ్ర.. రూ. 52 లక్షలు..
ఉమ్మడి తూర్పు గోదావరి.. రూ. 46 లక్షలు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి.. రూ. 39 లక్షలు..
ఉమ్మడి గుంటూరు.. రూ. 45 లక్షలు..
ఉమ్మడి కృష్ణా.. రూ. 39 లక్షలు
ఉమ్మడి నెల్లూరు.. రూ. 11 లక్షలు..
మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 5.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 82 లక్షలు..
ఓవర్సీస్.. రూ. 76 లక్షలు..
టోటల్ వరల్డ్ వైడ్.. రూ. 7.53 (రూ. 7.01 కోట్ల గ్రాస్) కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
మొత్తంగా రీ రిలీజ్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా గబ్బర్ సింగ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ లో తెలుగులో మురారి సినిమా టోటల్ రన్ లో రూ. 8.90 కోట్ల గ్రాస్ వసూల్లతో తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. మరి ఈ వసూళ్లను రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమా క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.