Pawan Kalyan HHVM Teaser Update: 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తెగ బిజీగా ఉన్నారు. అయితే ఈమధ్య వరస సినిమాలకు సైన్ చేసి కూడా ఆశ్చర్యపరిచారు ఈ హీరో. ఒక పక్క పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే సినిమాల షూటింగ్స్ లో కూడా పాల్గొంటూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని పవర్స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ముఖ్య కారణం ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక వారియర్ గా కనిపించనున్నారు. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే 70% దాకా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం.. పవన్ పొలిటికల్ కాంపెయిన్ వల్ల లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. 


ఈ క్రమంలో ఈ సినిమా గురించి సూపర్ అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు చిత్ర యూనిట్. అందులో ఈ అప్డేట్ ఎవరు ఊహించని టైంలో ఈరోజు విడుదల కాగా.. ప్రస్తుతం ఆ అప్డేట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ‘ధర్మం కోసం యుద్ధం’ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు సినిమా మేకర్స్. ఆ పోస్టర్ లో మే 2న ఉదయం 9 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. ఆ అప్డేట్ టీజర్ అని పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక యాక్షన్ కట్ తో అదిరిపోయే టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.


అయితే ఈ అప్డేట్ పై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వస్తున్నాయి. ఎన్నో రోజుల నుంచి ఈ సినిమాని పెండింగ్ లో పెట్టి.. ఇప్పుడు రాజకీయాల ముందు ఈ టీజర్ అప్డేట్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు అందరూ. అంతేకాకుండా ఈ టీజర్ కూడా ఎలక్షన్స్ లక్ష్యంగానే ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఎందుకంటే ఈ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ ఉస్టాడ్ భగత్ సింగ్ టీజర్ లో కూడా గ్లాస్ గురించి డైలాగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం టీజర్ ద్వారా కూడా రాజకీయ డైలాగ్స్ పెట్టబోతున్నారేమో అని, అందుకే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ టీజర్ విడుదల చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడల్లా ఈ సినిమాని విడుదల కూడా చేయలేరు. ఎలక్షన్స్ అయ్యాక.. పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాక.. మాత్రమే ఈ సినిమా మిగతా షూటింగ్ పూర్తవుతుంది. మరి ఇంత తొందరగా టీజర్ విడుదల ఎందుకు అనేది అందరి సందేహం. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే ఈ చిత్ర టీజర్ విడుదలయ్యాకే వస్తుంది.


కాగా ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సాహో దర్శకుడు సుజిత్ తో ఓజి అనే సినిమా చేస్తున్నారు. ఇక తనకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కూడా ఉస్టాడ్ భగత్ సింగ్ అనే చిత్రంలో నటించాను అన్నారు. మరి ఈ సినిమాలు అన్నీ ఎప్పుడు విడుదలవుతాయో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook