Pawan Kalyan - Ustaad Bhagat Singh: ఏపీ సహా దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు మే 13న 4వ విడతలో ఎన్నికల నిర్వహించబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ తన రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్‌ నుంచి సినిమాలు ఆశించడం భంగపాటే అవుతోంది. కానీ పవర్ స్టార్ అభిమానులకు జోష్ ఇచ్చే వార్తను అందించారు మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు. ఈ నెల 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.  ఈ సినిమా రిలీజ్ డేట్ ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్‌ గతేడాది 'బ్రో' మూవీతో పలకిరించాడు. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమాను దీపావళి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.




మరోవైపు పవన్ కళ్యాణ్‌ సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌ వెంటనే ఈ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేయనున్నాడు. ఏది ఏమైనా గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్‌ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ చేస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.


Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook