Pawan Kalyan is Chief Guest for Ante Sundaraniki Movie Pre Release Event: నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. యువ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్‌ 10న తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో  'అంటే సుందరానికి' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అంటే సుందరానికి' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా ఇటీవలే ట్రైలర్‌ను వదిలిన చిత్ర బృందం.. జూన్ 9న ప్రీరిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేసింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఈ విషయాన్ని నేచురల్‌ స్టార్‌ నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. సుందర్ ప్రసాద్ కోసం వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అంటే సుందరానికి టీమ్ మరియు నేను థ్రిల్ అవుతున్నాం. 9న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నాను'అని నాని ట్వీట్ చేశాడు. 


'అంటే సుందరానికి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ వస్తుండంతో ఫాన్స్ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన 'అంటే సుందరానికి' టీజర్, ట్రైలర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా నజిమ్ ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్‌గా నిలిచాయి. 



ఈ చిత్రంలో సుందర్‌గా నాని, లీల పాత్రలో నజ్రియా నజిమ్ కనిపించనున్నారు. 'అంటే సుందరానికి' సినిమాలో నరేశ్‌, రోహిణి, నదియా, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాని కామెడీ, నజ్రియా అందం సినిమాకు ప్లస్ కానున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 


Also Read: SSMB28 Update: మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా?  


Also Read: Vastu Tips for Home Cleaning: ఇంటిని ఇలా శుభ్రం చేస్తే.. లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook