Jani Master assaults women:  ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై తాజాగా అత్యాచారం కేసు నమోదు అయింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్న ఆ యువతి 2017 లో ఒక ఛానల్ లో ప్రసారమైన ప్రముఖ డాన్స్ షోలో జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని,  తమతో తెలిపినట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత జానీ మాస్టర్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఆయన టీం యువతీకి పదే పదే ఫోన్ కాల్ చేసేవారట.  ఇక 2019లో జానీ మాస్టర్ టీం లో ఆ యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో ఒక షో కోసం ముంబైకి వెళ్ళినప్పుడు బస చేసిన హోటల్లో జానీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పవద్దంటూ ఆమెను బెదిరింపులకు గురి చేశారట. 


షూటింగ్ సమయాల్లో కూడా అతను చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆమె తెలిపింది. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటే జన జానీ మాస్టర్ బలవంతం చేశాడని, వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని దాడి చేశాడని తెలిపింది. 


 



ఆగస్టు 28న ఒక వింత పార్సెల్ వచ్చిందని పేరు లేకుండా తలుపుకు వేలాడదీసారని దాని లోపల కంగ్రాట్యులేషన్ ఫర్ సన్ బి కేర్ఫుల్ అని రాసి ఉందని ఆమె తెలిపింది. అయితే ఈ విషయంపై పోలీసులు జానీ మాస్టర్ పై కేసు ఫైల్ చేయగా.. ఈ విషయం విన్న జనసేన పార్టీ తాజాగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ పై  సస్పెండ్ వేటు వేసింది.
తాజాగా శ్రీ షేక్ జానీ చేసిన తప్పుడు పనికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అతడు పార్టీ పనులకు కూడా దూరంగా ఉండాలని సస్పెండ్ వేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది..


Also Read: Entertainment news: పనిమనిషి అంటూ ఇంట్లో చేరిన మంత్రి కుమార్తె.. కట్ చేస్తే..!


Also Read: Thalapathy 69: విజయ్ ఆఖరి సినిమా అప్డేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పేసిన నిర్మాణ సంస్థ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.