త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమా 'అజ్ఞాతవాసి' . ఈ చిత్ర యూనిట్ యూరప్ లో షూటింగ్ జరుపుకొంటోంది. త్రివిక్రమ్ ఈ సినిమాలో పవన్ ను డిఫరెంట్ గా చూపిస్తున్నారట. ఫైట్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. 


ఆల్రెడీ పవన్ కు కరాటే, మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. అయినా ఈ సినిమా కోసం పవన్ రెండు నెలలు ప్రాక్ట్రిస్ చేశాడట. ఓకే అనుకున్న తరువాత షెడ్యూల్ లోనే మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందనీ.. సినిమాకి ఈ ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతోంది. పవన్ ఫ్యాన్స్ తో ఈల వేయించేలా ఈ ఫైట్ ఉంటుందట. 'అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10, 2018న విడుదలై సంక్రాంతి బరిలో నిలబడనుంది.