Bheemla Nayak Movie: మొదలైన `భీమ్లా నాయక్` సందడి.. థియేటర్ల వద్ద పవన్ ఫాన్స్ హంగామా!!
Pawan Kalyan Movie Bheemla Nayak hits Theaters: `పవర్ స్టార్` పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. శుక్రవారం `భీమ్లా నాయక్` సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
Pawan Kalyan Movie Bheemla Nayak hits Theaters: 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. శుక్రవారం 'భీమ్లా నాయక్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే విదేశాల్లో సందడి చేసిన పవన్ ఫాన్స్.. ఈరోజు ఉదయం నుంచి భారత్‌లో కూడా హంగామా చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి.
బీమ్లా నాయక్ సినిమా ఈరోజు విడుదలవటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉదయం 6 గంటల నుంచే థియేటర్ల వద్దకి చేరుకున్నారు. సినిమా హాళ్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. పవన్ కటౌట్లకు హారతులు ఇస్తూ, పుష్ప గుచ్చాలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫాన్స్ లుంగీలు కట్టుకొని థియేటర్లల వద్ద సందడి చేస్తున్నారు. కొంతమంది ఫాన్స్ టిక్కెట్లు దొరక్కపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇక టికెట్స్ దొరికిన వారు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
వైజాగ్, గుంటూరు, విజయవాడ, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. 'వకీల్ సాబ్' వంటి సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రం కావడం, రానా దగ్గుబాటి నటించడం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించడంతో బీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే సినిమా ఉందని తెలుస్తోంది.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన బీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిచిన భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు నటించారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రానికి ఇది రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
Also Read: Ukraine vs Russia: ఉక్రెయిన్‌లో తెరకెక్కిన తెలుగు సినిమాలు ఇవే.. మొదటి సినిమా ఏదంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook