Bheemla Nayak First Review: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమట..!!
Bheemla Nayak Final Copy Report : పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్‌ను రాక్ చేయడానికి తిరిగి వచ్చేస్తున్నాడట.. ఉమైర్ సంధు పోస్ట్‌తో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో పూనకాలు. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమని చెప్పేశాడు.
Pawan Kalyan Bheemla Nayak First Review : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తోన్న మూవీ "భీమ్లా నాయక్". జనవరి 12వ తేదీన ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
మలయాళంలో సూపర్‌హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియమ్" రీమేక్‌గా "భీమ్లా నాయక్" (Bheemla Nayak) తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. సాగర్ కే చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, ప్రముఖ మూవీ రివ్యూవర్ ఉమైర్ సంధు భీమ్లా నాయక్ తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు.
ఈ రోజే భీమ్లా నాయక్ ఫైనల్ కాపీ వచ్చింది.. భీమ్లానాయక్ మూవీకి సంబంధించిన 2 గంటల 11 నిమిషాల ఫైనల్ కాపీ వచ్చేసింది.. తనకు వచ్చిన ఇన్సైడర్ రిపోర్ట్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయంటూ.. రివ్యూవర్ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. అంతేకాదు.. బాక్సాఫీస్‌ను రాక్ చేయడానికి పవన్ కల్యాణ్ (PawanKalyan) తిరిగి వచ్చేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపించాడు ఉమైర్ సంధు. ఇక ఉమైర్ సంధు (Umair Sandhu) ట్వీట్‌ను బట్టి.. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమని తెలుస్తోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ లో భీమ్లా నాయక్ మూవీని త్వరగా వెండి తెరపై వీక్షించాలన్న ఉత్సాహం మరింత పెరిగింది.
Final Copy is Out today = #BheemlaNayak 💥💥 ! 2 hrs 11 minutes Final Copy ! Insider Reports are MINDBLOWING ! #PawanKalyan is back to Rock the Boxoffice 🔥
తాజాగా భీమ్లా నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Music Director Thaman) కూడా ఈ మూవీని డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి చూసిన విషయం తెలిసిందే. థమన్ కూడా ఈ మూవీపై ఇలాంటి రిపోర్టే ఇచ్చాడు. భీమ్లా నాయక్‌లో పవన్ కల్యాణ్ ఆవేశపూరిత నటన అదిరిపోయింది అంటూ తమన్ పేర్కొన్నాడు. భీమ్లా నాయక్ రోల్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బెస్ట్ అవుతుందంటూ.. పవన్ తన నటనతో చంపేశాడంటూ తమన్ చెప్పుకొచ్చాడు.
Also Read : Ketika Sharma Photos: హాట్ హాట్ అందాలతో ఊరిస్తోన్న ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ
ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు బిగ్గెస్ట్ హిట్ అవుతుందంటూ.. పవన్ భీమ్లా నాయక్‌తో (Bheemla Nayak) అందరినీ షాక్‌కి గురి చేస్తాడంటూ తమన్ చెప్పారు. త్రివిక్రమ్‌తో కలిసి తాను సినిమాను చూశానని.. త్రివిక్రమ్ కూడా పవర్ స్టార్ (Power Star) నటనకు థ్రిల్ అయ్యాడంటూ థమన్ చెప్పుకొచ్చాడు.
Also Read : SS Thaman on Bheemla Nayak: పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ భీమ్లా నాయక్: తమన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook