OG Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తారా.. అని అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అభిమానుల తమ ఆశలన్నీ.. ఓజీ సినిమా మీదే పెట్టుకున్నారు. కాగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది.. అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక సినిమా ఈ డేట్ ను ఆక్రమించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ ఆట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా కూడా అదే రోజున విడుదలవుతుంది.. అని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఎంతో దగ్గరైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


నాగవంశీ, పవన్ కళ్యాణ్ మధ్య కూడా మంచి బంధం ఉంది. పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ సినిమాని కూడా నిర్మించింది సితార ఎంటర్టైన్మెంట్స్ వారే. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రోజే.. తమ సినిమా విడుదల చేయడానికి నాగ వంశీ ఏమాత్రం ఆసక్తి చూపించరు. 


ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్.. సినిమా విడుదల అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడుతుంది..అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. 


సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో.. దుల్కర్ సల్మాన్ సినిమా పోస్టర్ ను చూసి అభిమానులు హర్ట్ అయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు. ఈసారి కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే.. షూటింగులలో మళ్లీ అంత త్వరగా పాల్గొంటారా లేదా.. అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  


అందుకే పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ..కొందరు చెబుతున్నారు. ఏదేమైనా సుజిత్ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించి బోలెడు అప్డేట్లు ఇచ్చారు. ఈ సమయంలో సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటే.. అభిమానులు సైతం ఖంగు తింటున్నారు.


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter