Pawan Kalyan Remuneration For OG Movie పవన్ కళ్యాణ్‌ తీసుకునే రెమ్యూనరేషన్‌ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. వకీల్ సాబ్ సినిమాకు ఇరవై ఐదు రోజులు కేటాయించాడని, ఒక్కో రోజుకు రెండు కోట్ల చొప్పున యాభై కోట్లు తీసుకున్నాడని టాక్. అలానే భీమ్లా నాయక్ సినిమా కూడా చేశాడని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు మన హీరోల రెమ్యూనరేషన్లు వంద కోట్లకు చేరుకున్నాయి. ప్రభాస్ అయితే నూట ఇరవై కోట్ల వరకు తీసుకుంటున్నాడు. బన్నీ, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ వంటి వారు కూడా వంద కోట్లు తీసుకుంటాడని గుసగుసలు వినిపిస్తుంటాయి. చిరంజీవి అయితే నలభై నుంచి యాభై కోట్లు తీసుకుంటున్నాడట. మహేష్‌ బాబు సైతం యాభైకి పైనే తీసుకుంటాడని సమాచారం.


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించ ఇతెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. దానయ్య సుజిత్ కలిసి చేస్తోన్న సినిమాలో పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్‌ దాదాపుగా డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.


సుజిత్-దానయ్య సినిమాకు పవన్ ఏకంగా 75 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట. అంతే కాకుండా సినిమాకు వచ్చే లాభాల్లో మూడో వంతు వాటా తీసుకుంటున్నారని సమాచారం. ఇదంతా ఒకెత్తు అయితే.. ప్రాజెక్ట్ సెట్ చేసినందుకు త్రివిక్రమ్ ఒక వంతు తీసుకుంటాడట. మిగిలిన ఒక వంతు నిర్మాత దానయ్యకు వస్తుందట.


ఇలా అందరూ అన్నీ తినేశాక.. మిగిలింది దానయ్యకు వచ్చేలా ఉంది. సినిమా నిర్మాణానికి పవన్ రెమ్యూనిరేషన్‌లతో కలిపి 175 కోట్ల వరకు అవుతుందని సమాచారం. ఈ లెక్కన నిర్మాత దానయ్యకు ఓ పది కోట్లు మిగలాలి అన్నా సినిమా మొత్తం 200 కోట్లు పైగా మార్కెట్ చేయాల్సి ఉంటుందని, నాన్ థియేటర్ మీద కనీసం వంద కోట్లు అయినా రావాల్సి ఉంటుందట.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి