Pawan Kalyan Movie With Sai Dharam Tej : మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న ఒక ఆసక్తికర గాసిప్ ఇప్పుడు అధికారికం అయిపోయింది. మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి,  రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా,  ఆ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సమయంలో వారికి ఊరటనిచ్చేలా పవన్ కళ్యాణ్,  సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ రాగా ఇప్పుడు దానికి సంబంధించిన అధికారిక సమాచారం వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయడం ఆపేస్తా అని ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో తిరిగి సినిమాలు చేయడానికి ఒప్పుకుని అందులో భాగంగానే వకీల్ సాబ్,  భీమ్లా నాయక్ సినిమా విడుదల కాగా ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో  హరిహర వీరమల్లు షూట్ చేస్తున్నారు. తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్,  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే బండ్ల గణేష్ నిర్మాతగా కూడా ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు బండ్ల  ప్రకటించుకున్నారు కానీ ఆ విషయం మీద క్లారిటీ లేదు. 


అయితే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ చిత్తం అనే సినిమా రీమేక్ తెలుగులో చేస్తారని అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  సుప్రీం స్టార్ సాయిధరమ్ తేజ కలిసి నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. నటుడు,  దర్శకుడు అయిన సముద్రఖని తమిళ్ లో తెరకెక్కిన వినోదయ చిత్తంలో ఆయన నటించిన పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ చేత నటింపచేస్తున్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది.


అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ లో ఈ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సముద్రఖని స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభించి,  పూర్తి చేసి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి ప్రారంభమై పోయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ కుదిరిన వెంటనే సినిమా షూటింగ్ ప్లాన్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మరింత సమాచారం గురించి క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read:Naresh - Pavitra Lokesh : పెళ్లి వార్తల నేపథ్యంలో భర్త అలాంటి వాడంటూ పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!


Also Read:Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.