Pawan Kalyan Sai Dharam Tej Movie పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో వినోదయ సిత్తం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను నేడు ప్రారంభించారు. ఈ మేరకు స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో పవన్ కళ్యాణ్‌ ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. మామ, అల్లుళ్లను ఇలా చూసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషి అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ కూడా ఇప్పుడు రీమేక్‌ల మీద పడ్డారు. చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలన్నీ కూడా రీమేక్‌లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ సైతం ఎక్కువగా రీమేక్‌ల మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. వినోదయ సిత్తం, తేరి సినిమాలను రీమేక్ చేయనున్నాడు. అయితే పవన్ కళ్యాణ్‌ చేస్తోన్న రీమేక్‌ల వెనుక త్రివిక్రమ్ హస్తం ఉంటుందని అంతా అంటుంటారు.


వినోదయ సిత్తం సినిమాను రీమేక్ చేయడంలోనూ త్రివిక్రమ్ హస్తమే ఉందని టాక్. ఇక వినోదయ సిత్తం తెలుగు వర్షన్‌కు త్రివిక్రమే స్క్రిప్ట్ రచించాడని, త్రివికమ్ పంచ్‌ డైలాగ్స్‌ అన్నీ కూడా ఇందులో ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ మాటలకు సముద్రఖని డైరెక్షన్ తోడవుతుందన్న మాట. ఇప్పుడు ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా సముద్రఖని పరిచయం కాబోతోన్నాడు.


సముద్రఖని ఈ సినిమా కోసం ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదులుకున్నట్టుగా తెలుస్తోంది. అసలే ఇప్పుడు సముద్రఖని తెలుగులో మంచి పాత్రలను దక్కించుకుంటున్నాడు. విలన్‌గా తెలుగు స్టార్ హీరోలతో ఢీ కొట్టేస్తున్నాడు. చివరగా మహేష్‌ బాబు సర్కారు వారి పాటలో విలన్‌గా మెప్పించాడు సముద్రఖని.


పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాల్సి ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. అది కాకుండా హరీశ్ శంకర్ సినిమాను చేయాలి. ఆ తరువాత సుజిత్ దానయ్య సినిమాను పట్టాలెక్కించాలి. ఈ లోపు మరేదైనా ప్రాజెక్ట్ వచ్చి పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.


Also Read:  Rashmi on amberpet stray dog : కుక్కల దాడిలో పసిబిడ్డ మృతి.. కనికరం చూపించకుండా వాటికే యాంకర్ రష్మీ సపోర్ట్


Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook