Pawan Kalyan Second Wife: పవన్ కళ్యాణ్ గెలుపుని పవర్ స్టార్ అభిమానులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ.. అకిరా అలానే పవన్ కళ్యాణ్ మూడో భార్య.. కనిపించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఈరోజు విడుదలవుతున్న ఫలితాల ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ఫలితంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లలోను ఓడిపోయారు. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


ఇక ఈ సంబరాలు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని పవన్ నివాసం బయట పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలకు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తుండటంతో.. అక్కడ పవన్ భార్య అన్నా లేజనోవా, తనయుడు అకిరా నందన్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించినందుకు.. వారిద్దరూ కూడా.. ధన్యవాదాలు తెలిపారు. 


కాగా పవన్ కళ్యాణ్ మూడవ భార్యతో ఇలా తన రెండవ భార్య కొడుకు అకిరా కనిపించడంతో.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.


కాగా కొన్ని గంటల క్రితమే పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజి నుంచి సినిమా యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఓజీ టైం బిగిన్స్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సైతం వైరల్ అవుతూ పవన్ అభిమానులను ఖుషీ చేస్తోంది.


 



 


Read more; Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..


Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter