Pawan Kalyan Kushi Re Release పవన్ కళ్యాణ్‌ ఖుషీ సినిమాకు ఉన్న హిస్టరీ, క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాను కోలీవుడ్‌లో విజయ్‌తో ఈ సినిమాను తీశాడు. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో తీశాడు. కోలీవుడ్‌లో కాస్త పర్వాలేదనిపించింది. కానీ తెలుగులో మాత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నింటినీ ఈ చిత్రం చెరిపేసింది. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి చిత్రాలను రిలీజ్ చేయగా.. ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఖుషి సినిమాను న్యూ ఇయర్ స్పెషల్ అంటూ డిసెంబర్ 31న రిలీజ్ చేయబోతోన్నారు. దీంతో అభిమానుల్లో ఇప్పుడే సంబరాలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఖుషి టికెట్ల కోసం ఎంతగా పడిగాపులో కాశారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశాలున్నాయి.


ఒక్క రోజే ఈ సినిమాను ప్రదర్శించబోతోన్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఏడాదిని ఖుషీగా ఖుషి సినిమాతో వెల్కమ్ చెప్పేందుకు పవర్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్, ఎస్ జే సూర్య ఖుషీ రీ రిలీజ్ మీద పోస్టులు వేశారు.


 



ఎన్ని తరాలు మారినా, లవ్ స్టోరీల్లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌, ఎప్పటికీ నిలిచిపోయే రొమాంటిక్ సినిమా ఖుషీ అంటూ చెప్పుకొచ్చారు. మీ దగ్గరల్లోని థియేటర్లో డిసెంబర్ 31న ఖుషి సినిమా మ్యాజిక్‌ను మరోసారి అనుభూతి పొందండి అంటూ ఎస్ జే సూర్య వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


Also Read : Sridevi Chiranjeevi Song : బాస్ గ్రేస్ అదుర్స్.. దేవీ బీట్ సూపర్.. శ్రుతి అందాలు హైలెట్


Also Read : Kannada Star Darshan : స్టార్ హీరో దర్శన్‌పై చెప్పు విసిరిన ఆకతాయిలు.. బాధ కలిగించిందన్న శివ రాజ్‌కుమార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook