Pawan Kalyan: పవన్ ను చంపేస్తామన్న నిందితుడు ఇతనే..!
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు నుంచి కాల్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిపై ఏపీ, తెలంగాణలో కలకలం రేపిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడి కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషీకి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరు కు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. రెండు రోజుల క్రితమే మల్లికార్జున రావు నెల్లూరు నుంచి తిరువూరు కు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర పెద్దలకు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వరకు జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించారు. అంతేకాదు హింతుత్వ అంశాన్ని తీసుకొని ప్రజల్లో బలంగా వెళుతున్నారు. దీంతో ప్యాన్ ఇండియా స్టార్ కంటే ముందు ప్యాన్ ఇండియా పొలిటిషన్ అయ్యారు. అంతేకాదు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.