Chiranjeevi Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకానున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఒకే వేదిక పై మెగాస్టార్, పవర్ స్టార్ మరియు మెగా పవర్ స్టార్ సందడి చేయడం.. మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. మొదట విజయవాడ కేంద్రంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సన్నాహాలు చేశారు. ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వేడుకను భాగ్యనగరానికి మార్చింది చిత్రయూనిట్.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిచారు. ఇందులో చిరంజీవి జోడిగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీను చిరు సతీమణి కొణిదెల సురేఖ సమర్పిస్తుండడం విశేషం.


Also Read: Chiranjeevi Acharya: ఆచార్య ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక విషయంలో ట్విస్ట్... మారిన వేదిక..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook