Pawan Kalyan Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ 'భీమ్లా నాయక్' సినిమా ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే. ట్రైలర్‌లో పవన్ కల్యాణ్.. రానా పలికిన డైలాగ్స్ అద్భుతంగా పేలాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావు..' అనే రానా డైలాగ్‌తో 'భీమ్లా నాయక్' ట్రైలర్ ప్రారంభమవుతుంది. 'పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్వు స్లోగానే పోనియ్యి. డాని.. డానియెల్ శేఖర్.', 'నీ గన్‌లో బుల్లెట్ కనబడకపోతే కేసు.. నా బాడీలో కనిపిస్తే కేసు..' అంటూ రానా చెప్పే డైలాగ్స్... బుల్లెట్ బైక్‌పై నుంచి దిగుతూ.. 'సర్హద్ భీమ్లా నాయక్.. సబ్ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీశైలం తహశీల్.. శ్రీశైలం మండలం, ఆంధ్రప్రదేశ్..' అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్ అని చెప్పొచ్చు.


హీరోయిన్ నిత్యా మీనన్.. 'ఏం నాయక్.. నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా.. చూసుకోవాలి కదా..' అంటూ చెప్పే డైలాగ్ కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంది. ఇక ట్రైలర్ చివరలో పవన్ కల్యాణ్-రానా మధ్య ఫైట్ గూస్ బంప్స్ అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. మొత్తంగా భీమ్లా నాయక్ ట్రైలర్ అభిమానులను ఇంప్రెస్ చేయడమే కాదు.. అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి.


సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తివ్రిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 25న భ్లీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి జనవరి 12నే భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉండగా... కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడక తప్పలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఎట్టకేలకు మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా.. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. ఈవెంట్ వాయిదా వేయడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్ తాజాగా విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్‌ను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.




Also Read: Bheemla Nayak: ట్రైలర్ గంట ఆలస్యం... భీమ్లా నాయక్ టీమ్ ను ఏకిపారేసిన ఫ్యాన్స్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook