Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆరాధ్య కథానాయిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటన కంటే తన గ్లామరస్ పాత్రలతో ఆడియన్స్‌ ఈమెను గుర్తు పెట్టుకున్నారు. సినిమాల్లో అవసరానికి మించి గ్లామర్ డోస్ ప్రదర్శించడంతో ఈమె యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈమె తనను కొంత మంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని RX 100 బ్యూటీ సంచలన ఆరోపణలు చేసింది. అయితే 2019లో తాను 'రక్షణ' సినిమా అనే సినిమా చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం నా సక్సెస్‌లు చూసి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించినందుకు తనకు రావాల్సిన పారితోషకం ఇవ్వలేదు. అది కాకుండా.. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ప్రమోషన్స్‌కు రాకపోతే బ్యాన్ చేస్తామంటున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో నా పేరు, క్యారెక్టర్ ఉంటే చట్టపరమైన తప్పవు అని ఆమె Xలో పేర్కొన్నారు. పాయల్ రాజ్‌పుత్ విషయానికొస్తే.. తెలుగులో బాలకృష్ణతో కలిసి 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో జయసుధ పాత్రలో నటించింది. అటు వెంకటేష్ హీరోగా నటించిన 'వెంకీమామ'లో కథానాయికగా నటించింది. అది తప్పించి ఈ అమ్మడికి బడా హీరోలను నుంచి పెద్దగా ఆఫర్స్ ఏమి రాలేదనే చెప్పాలి. మంచు విష్ణు సరసన నటించిన 'జిన్నా'లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు సన్నిలియోన్ కూడా నటించింది. దీంతో పాయల్ పై ఫోకస్ కాస్తంత తగ్గింది.


ఆ మధ్య సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు ఒరిందేమి లేదు. అందుకే గ్లామర్ రోల్స్ ను మాత్రమే ఎంచుకుంది. పాయల్ రాజ్‌పుత్ ముందుగా టీవీ సీరియల్స్‌లో నటించి ఆ తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది. గతేడాది ఈమె 'మంగళవారం' సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.


Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి