Peka Medalu: పేక మేడలు సినిమాకి అరుదైన రికార్డ్.. ప్రేక్షకుల దగ్గర నుంచి జేజేలు!
Peka Medalu Review: జూలై 19న విడుదలైన తెలుగు సినిమా పేక మేడలు. ఈ సినిమా విడుదలకు ముందే.. ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో సినిమాపై అంచనాలు మంచిగా ఏర్పడ్డాయి. విడుదలైన తరువాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ.. కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈరోజు ఘనంగా జరిపారు సినిమా యూనిట్..
Peka Medalu Success Meet: ఈ మధ్య విడుదలైన చిన్న బడ్జెట్ చిత్రాలు.. కథపరంగా బాగుంటే.. ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాల కన్నా కూడా.. చిన్న బడ్జెట్ సినిమాలు.. నిర్మాతలకు సైతం ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పుడు అదే రికార్డ్స్ సొంతం చేసుకుంది పేక మేడలు. ముఖ్యంగా ఈ సినిమాకు.. ఎక్కువగా రిపీటెడ్ ఆడియన్స్ రావడం విశేషం.
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా.. వచ్చిన ఈ చిత్రంలో వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నటించారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకొని.. మంచి కథాంశం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. ఈ చిత్రం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
ముఖ్యమైన విషయం ఏమిటి అంటే..ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ₹100 కే టికెట్లు రేట్లు ఉండడం సినిమాకి ప్లస్. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. కాగా ఈ చిత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటూ ఉండటంతో.. ఈ క్రమంలో ఈరోజు.. గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు సినిమా యూనిట్.
ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు నీలగిరి మామిళ్ల గారు మాట్లాడుతూ : స్టార్టింగ్ నుంచి మా సినిమాకు మీడియా ఇస్తున్న సపోర్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం రిలీజ్ అయిన దగ్గరనుంచి 50 కాల్స్ పైన వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాత రాకేష్ గారికి మా టీం కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు అన్నారు.
ఇక ఆ తరువాత నిర్మాత రాకేష్ వర్రే గారు మాట్లాడుతూ : దాదాపు రెండు సంవత్సరాలు.. ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో.. నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి మంచి సినిమాలు ఇకమీదట తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది చాలా తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్కు వస్తారు. ఈ విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో వినోద్ కిషన్, అనూష కృష్ణ తో పాటు..రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి