Modi on Kashmir Files: నిజాలు చూపించారంటూ.. కశ్మీర్ ఫైల్స్ మూవీపై ప్రధాని ప్రశంసలు!
Modi on Kashmir Files: విడుదలకు ముందే అనేక వివాదాలు చుట్టుముట్టిన మూవీ కశ్మీర్ ఫైల్స్. ఇప్పుడు ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ మూవీని పొగిడారు.
Modi on Kashmir Files: ఎన్నో వివాదాల నడుమ థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలన్నారు. భారతీయ జనతా పార్టి (బీజేపీ) పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడిన మోదీ కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ప్రస్తావించారు.
ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న నిజాన్ని ఈ సినిమా బహిర్గతం చేసిందన్నారు ప్రధాని. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడిపై కూడా మోదీ ప్రశంసలు కురిపించారు.
ఏమిటి ఈ సినిమా ప్రత్యేకత?
1990 కశ్మీర్లో పిండిట్లపై జరిగిన దాడుల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. హిందువులపై అల్లరి మూఖలు తుపాకులతో దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రాణాలు కాపాడపుకునేందుకు పండిట్లు కశ్మీర్లో తమ ఇళ్లను, ఆస్తులను వదిలి వలసలు వెళ్లారు. అలాంటి వ్యక్తుల కన్నీటి గాధలను సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి.
అనుపమ్‌ఖేర్, దర్శన్‌కుమార్. మిథున్ చక్రవర్తి, పల్లవీ జషీ, చిన్మయ్ మండ్లేకర్, ప్రకాశ్ బేల్వాడీ సహా పలువురు ఈ సినిమాలో నటించారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. భావోద్వేగంగా స్పందిస్తున్నారు. సినిమాలోని డైలాగ్స్ ప్రతి ఒక్కటి మనస్సును తాకుతాయని చెబుతున్నారు. ఇక ఈ మూవీపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ పిలపునిస్తున్నారు.
Also read: Rashmika Mandanna: యువ హీరోతో రష్మిక మందన్న రొమాన్స్.. సూపర్ కాంబో!!
Also read: Shivam Sharma: అమ్మ స్నేహితురాలితో బెడ్ షేర్ చేసుకున్నా.. క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook