Police Case Filed Against Saranya Ponvannan Over Parking Dispute: ప్రముఖ నటి శరణ్య పొన్వన్నన్ చేసిన పనికి ప్రస్తుతం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని చెన్నైలోని విరుగంబాక్కంలో ఆమె నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె గత కొన్నిరోజులుగా ఆమెకు, పొరుగింట్లో ఉంటున్న మరో మహిళ శ్రీదేవీకి పార్కింగ్ విషయంలో గొడవ జరిగేది. దీంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో శరణ్య పొన్వన్నన్, సదరు మహిళ కొట్టుకున్నారంట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Journalist Overpowers Leopard: చిరుతపులితో ఫైటింగ్ చేసిన జర్నలిస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..


అంతటితో ఆగకుండా.. శరణ్య పొన్వన్నర్ చంపుతానంటూ కూడా ఆమెను బెదిరించారంట. దీంతో బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శరణ్య పొన్వన్నన్.. రఘువరన్ బీటెక్, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరును తెచ్చుకున్నారు. అదే విధంగా అనేకు సినిమాల్లో అమ్మపాత్రలో నటించి అందరి మెప్పును కూడా పొందారు. ఈక్రమంలో తాజా ఘటనతో ఆమె వివాదంలో ఇరుక్కున్నారు. 


Read more: Famous Astrologer Venu Swamy: రోమాంటిక్ మూడ్ లో వేణుస్వామి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన వీడియో..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook