Bigg Boss Mehaboob: పుట్టినరోజు పేరుతో రేవ్ పార్టీ.. అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ మహబూబ్
Mehaboob Dil Se: డాన్స్ వీడియోలతో యూట్యూబర్ గా మారిన.. మెహబూబ్.. దిల్సే బిగ్ బాస్ తర్వాత బాగానే పాపులర్ అయ్యాడు. పలు డాన్స్ షోలలో కూడా కనిపించిన మెహబూబ్ యూట్యూబ్‌లో మంచి పేరు సంపాదించాడు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకి పెద్ద పార్టీ ఇచ్చిన మహబూబ్ ఇప్పుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
Police Case on Mehaboob Dil Se: మెహబూబ్ దిల్ సే అనే పేరుతో సోషల్ మీడియాలో.. కొన్ని మ్యూజిక్ వీడియోలు డాన్స్ వీడియోలు తో మెహబూబ్ చాలామందికి తెలుసు. ఆ తరువాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కి వచ్చాక మహబూబ్ ఇంకా పాపులర్ అయ్యాడు ఆ తరువాత ఒకటి రెండు డాన్స్ షోలలో కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తర్వాత నటుడిగా కూడా మారాడు. గేమ్ షోస్ లో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాడు మహబూబ్. తాజాగా జూలై 29న మహబూబ్ తన పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకి పెద్ద పార్టీ కూడా ఇచ్చాడు అయితే అది బర్త్ డే పార్టీ కాదు పెద్ద రేవ్ పార్టీ అంటూ ప్రచారం మొదలైంది.
స్నేహితులతో బర్త్డే పార్టీ చేసుకున్న మహబూబ్ మీద పోలీస్ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే తన పుట్టినరోజు సందర్భంగా మెహబూబ్ ఇండస్ట్రీలో తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి పెద్ద పార్టీ చేసుకున్నాడు. హైదరాబాద్ సిటీ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కంటైనర్ రిసార్ట్ ను బుక్ చేసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగింది. అయితే ఇది పుట్టినరోజు పార్టీ కాదు అని రేవ్ పార్టీ అని ఆరోపణలు వస్తున్నాయి. పైకి ఇది కేవలం పుట్టినరోజు పార్టీ మాత్రమే అని చెబుతున్నా కూడా.. అది రేవ్ పార్టీ అని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మెహబూబ్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి అసలు అనుమతి లేదట. అంతేకాకుండా పార్టీ పూర్తయిన తర్వాత రిసార్ట్ లో 10 లీటర్ల లిక్కర్ బాటిల్స్, ఐదు లీటర్ల బీర్ బాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో మెహబూబ్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఇక మహబూబ్ బర్త్డే పార్టీలో అతని స్నేహితులు శ్వేతా నాయుడు, గీతు రాయల్, శ్రీ సత్య, విరూపాక్ష సేం రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter