Police Registers Case on Ramya Raghupathi on Pavitra Lokesh’s Complaint: నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనూహ్యంగా పవిత్ర లోకేష్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తన మీద జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. తన పరువుకి భంగం కలిగిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్, పలు వెబ్సైట్ల మీద కేసు పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాక రమ్య రఘుపతి, ఇమంది రామారావు, విజయలక్ష్మి అనే వ్యక్తుల పేర్ల మీద కూడా ఆమె కేసు రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె కంప్లైంట్ లో పేర్కొన్న 15 యూట్యూబ్ ఛానల్స్ కి వెబ్సైట్లకు నోటీసులు జారీ చేశారని మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆ వెబ్సైట్ నిర్వాహకులకు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.


ఆమె శనివారం నాడు చేసిన ఫిర్యాదులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లు కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని కొన్ని నామీద, కొన్ని నరేష్ మీద, కొన్ని మా ఇద్దరి మీద కలిపి దుష్ప్రచారం  చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కొన్ని వెబ్సైట్స్ అయితే ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నాయని ఇవన్నీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక దీని వెనక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఉన్నట్లు కూడా తమకు అనుమానం ఉందని ఆమె పేర్కొన్నారు.


పోలీసులు ఇప్పటికే రమ్య రఘుపతి మీద అలాగే ఇమంది రామారావు అనే జర్నలిస్టుకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇమంది రామారావు ఈ రోజు విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇమంది రామారావు ఇమంది టాక్స్ అనే పేరుతో తమ మీద దుష్ప్రచారం చేసినట్లు పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.


Also Read:  I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!


Also Read: Minerva Coffe Shop : మహేష్ ఫాన్స్ కు వరుస విషాదాల తరువాత ఒక శుభవార్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook