Ponniyin Selvan 1 War Between Telugu Audience and Tamil Audiences: పొన్నియన్ సెల్వన్ మూవీ తమిళ తెలుగు ప్రేక్షకుల మధ్య రచ్చ రేపే అవకాశం కనిపిస్తోంది. తమిళ ప్రేక్షకులందరూ ఇది తమ బాహుబలి సినిమా అంటూ ముందు నుంచి భావిస్తూ వస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో 2015వ సంవత్సరంలో విడుదలైన బాహుబలి పార్ట్ వన్, 2017లో విడుదలైన బాహుబలి పార్ట్ 2 సినిమాలో కేవలం తెలుగు నాట మాత్రమే కాక తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటి నుంచి హిందీ నుంచి తమిళం నుంచి ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ సినిమా కూడా దాని దరిదాపులకు చేరుకోలేకపోయాయి. మళ్ళీ తానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రికార్డులను రాజమౌళి బద్దలు కొట్టారు. ఇప్పుడైనా బాహుబలి రికార్డులు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగింది పొన్నియన్ సెల్వన్ మూవీ అయితే ఈ సినిమా పూర్తిగా తమిళ రాజ్యాధికారాలు, రాజుల మీద రాసిన నవల ఆధారంగా రూపొందించిన సినిమా కావడంతో ఆయా రాజుల పేర్లు కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే అవకాశాలు తక్కువ.


చరిత్ర గురించి చదువుకుని వెళితే తప్ప సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎవరు ఎవరితో పోరాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నెట్టేశారు దర్శకుడు మణిరత్నం.  చోళులు, పాండ్యుల చరిత్ర తెలియని వారికి ఈ సినిమా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, పదుల కొద్దీ పాత్రల పరిచయం అవుతూ ఉంటాయి, నోరు తిరగని పేర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఓ అయోమయ వాతావరణం ఏర్పడింది.


మణిరత్నం చాలా టాలెంటెడ్ దర్శకుడు అయి ఉండవచ్చు కానీ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయకుండా కన్విన్సింగ్గా ఒప్పించడంలో విఫలమయ్యారు. తమిళ ప్రేక్షకుల సంగతి ఎలా ఉందో తెలియదు కానీ తెలుగు ప్రేక్షకులు అందరూ ఖచ్చితంగా సినిమాని ఒక్కసారి చూసి అర్థం చేసుకోవడం అయితే కష్టమనే చెప్పాలి. లేదా పొన్నియన్ సెల్వన్ చరిత్ర చదువుకుని వెళితే కన్ఫ్యూజ్ కాకుండా సినిమా చూసి బయటకు వచ్చే అవకాశాలుంటాయి.


తెలుగు ప్రేక్షకులు సినిమా బాలేదని కామెంట్ చేస్తుంటే ఇప్పుడు తమిళ ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. తమకు తెలుగు సినిమాలతో ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ తెలుగు వాళ్ళు మాత్రం కావాలనే తమ సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని తమిళ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే మీ సినిమాలను కూడా తమిళనాట ఫ్లాప్ చేస్తాం అంటూ అర్థం వచ్చేలా వాళ్ళు కామెంట్లు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.


దానికి తెలుగు అభిమానులు కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని, మీరు మా సినిమాలను తొక్కాలని చూసినా మేమేం చేయకుండా సైలెంట్ గా ఉన్నామని అంటున్నారు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ ఏమీ బాలేదని కాబట్టే బాలేదని కామెంట్ చేశామని తెలుగు అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. 


Also Read : Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!


Also Read : Sri Reddy on Bigg Boss: నేను ఛస్తే వెళ్లను.. నాగార్జున రంగేసుకుని ఎలా చేస్తున్నారు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.