Pooja Hegde Struggling for Telugu Movies: ముంబైలో సెటిల్ అయిన మంగళూరు ప్రాంతానికి చెందిన దంపతులకు జన్మించిన పూజా హెగ్డే చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అలా చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ చేస్తూ ఉండగా ఆమెను చూసిన ఒక తమిళ దర్శకుడు తన సినిమాలో ఆకాశం ఇచ్చాడు. ఆ మొదటి సినిమా హిట్ అవ్వకపోవడంతో ఆమెకి అవకాశాలు పెద్దగా దక్కలేదు కానీ పలు ఇతర భాషల సినిమాల్లో అవకాశాలు మాత్రం వచ్చేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ఆమె తెలుగులో ముకుంద అనే సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. అయితే ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో ఇక ఆమె పని అయిపోయింది అనుకున్నారు కానీ అనూహ్యంగా బాలీవుడ్లో ఏకంగా హృతిక్ రోషన్తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది. ఆమె దురదృష్టం వల్ల ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయింది. ఎప్పుడైతే అల్లు అర్జున్తో దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేసిందో అప్పటి నుంచి ఆమె దశ తిరిగి పోయింది.


దెబ్బకు ప్రస్తుతానికి తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఆమె వ్యవహార శైలి, ఆమె ట్రాక్ రికార్డు చూసి ఇప్పుడు ఆమెను బుక్ చేసుకునేందుకు ఏ నిర్మాత దర్శకుడు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. పూజా హెగ్డే చాలా కాస్ట్లీ అనే సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్ కావడంతో అంత డిమాండ్ చేయడంలో ఏమీ తప్పు లేదని అనుకున్నారు కానీ పూజ తన వెంట తీసుకొచ్చే టీం 12 మంది ఉంటారట.


వారందరి మెయింటెనెన్స్ తోటి ఒక చిన్న బడ్జెట్ సినిమా తీయవచ్చు అని నిర్మాతలు సరదాగా జోక్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆమె గత ఏడాది నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. రామ్ చరణ్ కాంబినేషన్లో చేసిన ఆచార్య, విజయ కాంబినేషన్లో చేసిన బీస్ట్, ప్రభాస్ కాంబినేషన్లో చేసిన రాదేశ్యామ్ బాలీవుడ్లో చేసిన సర్కస్ సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలవడమే కాక ఆమెకు మళ్ళీ ఐరన్ లెగ్ అనే పేరు తీసుకొచ్చేశాయని చెప్పక తప్పదు.


ప్రస్తుతానికి ఆమెకు చేతిలో మహేష్ బాబు 28వ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. దీంతో పూజా హెగ్డే తెలుగులో ఎలా అయినా మరో రెండు మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టాలని ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. అయితే మహేష్ బాబు సినిమా రిజల్ట్ చూసిన తర్వాతే ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అప్పటివరకు పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అని చెప్పుకుంటూనే ఉన్నా సినిమా అవకాశాలు మాత్రం నిల్ అనే చెప్పాలి.
Also Read: K Viswanath Body buried: విశ్వనాథ్ శరీరాన్ని దహనం చేయకుండా ఎందుకు పూడ్చి పెట్టారో తెలుసా?


Also Read: Bigg Boss’s Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో షాక్.. అసలు సంగతి అదేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.