Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్
Medical Student Preethi Suicide case వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యాయత్నానికి సంబంధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ఘటన మీద ఆల్రెడీ రాజకీయ రంగులు పులుముకున్నాయి.
Poonam Kaur on Medical Student Preethi Suicide Case: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ కేస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటన మీద పొలిటికల్ లీడర్లు స్పందించడంతో దీనిపై రాజకీయ రంగు పులిమినట్టు అయింది. ఈ కేస్ కాస్త లవ్ జిహాదిగా మారింది. బండి సంజయ్ చేసిన కామెంట్ల మీద సోషల్ మీడియా నుంచి భిన్న స్పందన వస్తోంది. అయితే సైఫ్ అనే వ్యక్తి మాత్రం ప్రీతిని వేధించినట్టుగా పోలీసులు గుర్తించారు.
సైఫ్‌కు పద్నాలుగు రోజులపాటు రిమాండ్ విధించారు. అయితే ఈ ఘటనలో ప్రీతి ఇంకా ప్రాణాలతో పోరాడుతోంది. ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తున్నారని, వెంటిలేటర్ మీద ఉందని హెల్త్ బుల్లిటెన్‌ను వైద్యులు వదులుతున్నారు. అయితే ఆమె ఇంకా ప్రాణాలతో బతికే ఉన్నా కూడా పూనమ్ కౌర్ మాత్రం వింతగా ట్వీట్ వేసింది. ఆమె చనిపోయినందన్నట్టుగా ట్వీట్ వేసింది.
'మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు' అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసింది.
అయితే దీనిపై జనాలు స్పందిస్తున్నారు. కాస్త తెలుసుకుని ట్వీట్లు వేయండి.. ఆమె ఇంకా బతికే ఉంది.. మీరు ఇలా ఇష్టమొచ్చినట్టుగా ట్వీట్లు వేయొద్దు.. అని కొందరు తిడుతున్నారు. మీరు కరెక్ట్‌గా చెప్పారు.. ఇలాంటి ఘటనల్లో ఎలాంటి శిక్ష వేసినా న్యాయం జరిగినట్టు కాదు అని ఇంకొందరు ఆమెకు సపోర్ట్‌గా ట్వీట్లు వేస్తున్నారు.
Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook