Poonam Kaur: రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చిన పద్మ అవార్డులలో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. దీనిపైన మెగాస్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రేక్షకులు మాత్రం కొన్ని సందేహాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. చిరంజీవి కన్నా ప్రజలకు సహాయం చేసిన ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారని.. వాళ్లకి ఇవ్వని సత్కారం ఎందుకు చిరంజీవికి ఇచ్చారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో సోనూసూద్ సోషల్ మీడియాలో ఎవరు సహాయం కావాలన్నా తెలుసుకొని మరి వెళ్లి సహాయం చేశారు. మరి అలాంటి వ్యక్తికి ఇవ్వని పద్మ భూషణ్ చిరంజీవికి ఎందుకు ఇచ్చారు అనేది చాలామంది ప్రశ్న.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఇదే ప్రశ్నను అడిగింది. సోనూసూద్ లాంటి వ్యక్తికి ‘పద్మ’ అవార్డు ఇచ్చి కేంద్రం గౌరవించాల్సింది అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి.. ఈ విషయం గురించి మాట్లాడారు. ఇక తాజాగా పూనమ్ కౌర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు.. “సోనూసూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డుకి అర్హులు. కరోనా టైములో ఆయన చేసిన సేవ అసామాన్యం. కానీ ఆయనకి ఏ రాజకీయ నాయకుడిని కాకాపట్టడం తెలియదు కదా” అంటూ పేర్కొన్నారు.


ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి రాజకీయ నాయకులను కాకాపట్టి ఈ అవార్డు తెచ్చుకున్నాడు అనే అర్థం వచ్చేటట్లు పోస్టు పెట్టుకొచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఇక చాలామంది ఈ పోస్టు షేర్ చేసి మరి కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి అభిమానులు…మెగాస్టార్ కి ఈ అవార్డు రావడం ఒప్పక చాలామంది ఇలా కామెంట్లు చేస్తున్నారు అని చిరంజీవిని వెనకేసుకొస్తుండగా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం చిరంజీవికి రావడాని తప్పు పట్టడం లేదు కానీ.. సోనూసూద్ కు ఎందుకు రాలేదు అనే ప్రశ్న అడుగుతున్నాము అంటూ పూనమ్ పెట్టిన మాటలను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.


Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు


Also Read:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook