కొద్ది రోజుల క్రితం సినీ రివ్యూ రైటర్ కత్తి మహేష్ చేసిన పలు ఆరోపణలతో వెలుగులోకొచ్చిన పూనమ్ కౌర్ పేరు ఆ తర్వాత ఎలాగోలా తెరమరుగైంది. ఇక ఆ వివాదం సమసిపోయిందిలే అని జనం మర్చిపోతున్న తరుణంలో ఈసారి ఆమే తనంతట తానుగానే వార్తల్లోకెక్కింది. " కొంతమంది బట్టలు మార్చినంత ఈజీగా.. మనుషులను మారుస్తూ రాజకీయాలు చేస్తారు" అంటూ పూనమ్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతోంది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది అనే విషయంలోనే అక్కడ క్లారిటీ లోపించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల పరిణామాలను పరిశీలిస్తే, ఆమె పెట్టిన పోస్ట్ పలానా వ్యక్తికి సంబంధించినదే అయ్యుంటుందేమోనని సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కొంతమంది కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులు మారుస్తూ... మాట మీద ఉండకపోవడం, జనాల ఇన్నోసెన్స్‌తో ఆడుకుంటూ వేష భాషలు మారుస్తూ, జనాలను మభ్యపెట్టి, అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో అని తెలిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని తనకు తెలిసిన తెలుగు పదాలను కలుపుకుంటూ ఇంగ్లీష్ అక్షరాల్లో పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యింది. రేపు తెల్లవారితే ఈ పోస్ట్ ఇంకెన్ని మలుపులు తిరగనుందో!!