Suvarna Sundari Movie Review హారర్, థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే వాటిని ప్రేక్షకులు మెచ్చేలా తీయడంలోనే విజయ రహస్యం ఉంటుంది. అదే సీక్రెట్‌ను ఫాలో అయి సువర్ణ సుందరిని తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. జయప్రద, పూర్ణ, డైలాగ్ కింగ్ సాయి కుమార్ వంటి నటీనటులతో తెరకెక్కించిన చిత్రం సువర్ణ సుందరి. ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 3) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ
సువర్ణ సుందరి కథ పదిహేనో శతాబ్దంతో లింక్ అయి ఉంటుంది. కళంకల్ రాజ్యంలో త్రినేత్రి అమ్మవారి విగ్రహం ఉంటుంది. దాన్నే సువర్ణ సుందరి అని కూడా పిలుస్తారు. ఆ విగ్రహంలోని దుష్టశక్తి వల్ల రాజ్యాలకు రాజ్యాలు కొట్టుకుని, చంపుకుని చస్తుంటాయి. అది ఎవరి చేతిలో ఉంటే వారు రాక్షసులుగా మారుతారు. అందరినీ హతమారుస్తుంటారు. అది అంజలి (పూర్ణ) చేతిలో పడుతుంది. దీంతో తన భర్తను, మామను అంజలి చంపేస్తుంది. తన కూతురు విశాలాక్షి (జయ ప్రద)ను కాపాడుకునేందుకు అంజలి ఆ విగ్రహంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. కానీ మళ్లీ అంజలి కొన్నేళ్ల తరువాత జన్మిస్తుంది. అలా మళ్లీ అంజలి చేతికే ఆ విగ్రహం దొరుకుతుంది? మళ్లీ రెండో సారి జరిగిన ఆ మారణహోమం ఏంటి? తన తల్లిని కాపాడుకునేందుకు విశాలాక్షి చేసే ప్రయత్నం ఏంటి? అసలు ఈ కథలో.. సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? విగ్రహం వెనుకున్న రహస్యం ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.


నటీనటులు
అంజలి పాత్రలో పూర్ణ రెండు గెటప్పుల్లో కనిపిస్తుంది. మోడ్రన్ లుక్‌లోనూ ఆకట్టుకున్న పూర్ణ.. ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌తోనూ మెప్పిస్తుంది. ఇక సాక్షి అయితే సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో మెప్పిస్తుంది. జయ ప్రద క్లైమాక్స్‌లో అదరగొట్టేస్తుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ పాత్ర తనకు అలవాటైన పోలీస్ పాత్రను ఎంతో ఈజ్‌తో చేసేశాడు. చర్చ్ ఫాదర్‌గా కోట శ్రీనివాసరావు, రాజగురువుగా నాగినీడు, మహారాజుగా అవినాష్‌ వంటి వారు తమ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.


విశ్లేషణ
ఓ దేవతలాంటి విగ్రహం.. కాపాడాల్సిందిపోయి.. ప్రాణాలను తీసుకుంటుంది.. దాన్ని పట్టుకుంటే చాలు రాక్షసుల్లా మారి విధ్వంసం చేసేస్తుంటారు.. అలాంటి అనంతమైన దుష్టశక్తిని అరికట్టడం ఎలా? అనే పాయింట్‌ మెప్పిస్తుంది. సువర్ణ సుందరి ఆటను ఎలా కట్టించాలి? అని ప్రేక్షకుడి చేత అనిపించడం, ఎదురుచూసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది.


అయితే ప్రథమార్థం మొత్తం కథనం కాస్త స్లోగా అనిపిస్తుంది. కథను చెప్పడానికి ఎంచుకున్న ఎంట్రీ, చూపించిన నేపథ్యం, ఆ రక్తపాతం బాగానే అనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కాస్త నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో కథలోని మలుపులు మెప్పిస్తాయి. 


క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ బాగుంటుంది. సాయి కార్తీక్ ఆర్ఆర్, పాటలు మెప్పిస్తాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్‌ టీం కూడా సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


రేటింగ్ 2.75
Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే


Also Read: K Vishwanath's Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook