రాజ్ కుంద్రాకు బెయిల్ ఇస్తే పారిపోయే ప్రమాదం: పోర్నోగ్రఫీ కేసులో ముంబై పోలీసులు
Raj Kundra may escape if granted bail: Mumbai Police to court in Pornography case: బ్లూ ఫిలింస్ చిత్రీకరించి, ఆ అశ్లీల దృశ్యాలను మొబైల్ యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడనే (Uploading adult content on apps) అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Raj Kundra may escape if granted bail: Mumbai Police to court in Pornography case పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తే.. అతడు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు తెలిపారు. రాజ్ కుంద్రాకు బ్రిటీష్ పౌరసత్వం (Raj Kundra Citizenship) ఉన్నందున అతడు నిరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మార్గంలోనే లండన్‌కు పారిపోయే ప్రమాదం ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
బ్లూ ఫిలింస్ చిత్రీకరించి, ఆ అశ్లీల దృశ్యాలను మొబైల్ యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడనే (Uploading adult content on apps) అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ వస్తోంది. ఇదే కేసులో రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ సినీ నటి అయిన శిల్పా శెట్టిని (Shilpa Shetty) సైతం ముంబై పోలీసులు ప్రశ్నించారు.
బాలీవుడ్‌కి చెందిన పలువురు బీ గ్రేడ్ హీరోయిన్స్, మోడల్స్‌తో నీలిచిత్రాలు నిర్మించి, వాటిని విదేశాలకు చెందిన మొబైల్ యాప్స్‌కి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్టు రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ముంబై పోలీసులు ఆరోపిస్తున్నట్టుగా రాజ్ కుంద్రాకు ఈ పోర్నోగ్రఫీ కేసుతో (Pornography case) సంబంధం లేదని కోర్టుకు విన్నవిస్తూ అతడి తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ (Raj Kundra bail plea) దాఖలు చేయగా .. అందుకు ప్రతిగా పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తూ అతడికి బెయిల్ ఇస్తే దేశం విడిచిపారిపోయే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు.