Power Star Pawan Attacked: లైవ్‌లో పవర్ స్టార్ పవన్ మీద దాడి.. తీవ్రంగా ఫైర్ అయిన హీరో!
Power Star Pawan Attacked: భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు పవన్ సింగ్ కార్యక్రమంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగిన వ్యవహారం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Pawan Singh Attacked: భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు పవన్ సింగ్ కార్యక్రమంలో రాళ్ల దాడి చేసిన ఉదంతం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. భోజ్‌పురి ఇండస్ట్రీ పవర్ స్టార్ గా అక్కడి వారు పిలుచుకునే పవన్ సింగ్ లైవ్ షో సందర్భంగా రాళ్లు రువ్విన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వైరల్ వీడియోలో, పవన్ సింగ్ వేదికపై ప్రదర్శన ఇస్తున్నట్లు కనిపిస్తోంది, ఇంతలో అతని చెవి దగ్గర ఒక రాయి తగిలినట్టు కనిపించింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, భోజ్‌పురి గాయకుడికి ఈ రాళ్ల దాడిలో ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదని అంటున్నారు.
ఇక ఈ మొత్తం వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జరిగిందని అంటున్నారు. పవన్ సింగ్ అక్కడి నాగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చారు. ఇక్కడ స్టేజ్ షో నిర్వహిస్తుండగా అదుపుతప్పిన జనంలో నుంచి ఎవరో పవన్ సింగ్ వైపు రాయి విసిరారు. రాయి నేరుగా అతని ముఖానికి తగిలిందని, అయితే పవన్ సింగ్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని అంటున్నారు. భోజ్‌పురి పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ సింగ్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది.
అడిగిన పాట పాడడం లేదని పవన్ సింగ్‌పై గుంపులోని ఓ గుర్తుతెలియని యువకుడు రాయి విసిరాడని చెబుతున్నారు. పవన్ సింగ్ పై రాళ్ల దాడి జరగడంతో ఈ కార్యక్రమంలో కలకలం రేగింది. తమకు నచ్చిన పాటలు పాడమని కొందరు పవన్ సింగ్‌ను కోరారని, అది ఆయన పాడలేదని దీంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి పవన్ సింగ్‌పై రాయి విసిరాడని అంటునారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో రాయి తగిలిన వెంటనే పవన్ సింగ్ షాక్ అయ్యాడు.
పాడుతున్న పాటను మధ్యలోనే ఆపేయడమే కాకుండా వేదికపై నుంచే రాళ్లదాడిపై ఫైర్ అయ్యాడు. గుంపులో దాక్కుని రాళ్లు రువ్వుతున్న వ్యక్తి ఎవరు అని వేదికపై నుంచి ప్రశ్నించిన పవన్ సింగ్.. ఈ వ్యక్తి తన శత్రువు అని, దమ్ము ఉంటే రహస్యంగా దాడి చేసే బదులు ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు తనను ఎవరూ ఆపలేకపోయారని, ఇలాంటి రాళ్లు కూడా తనను ఆపలేవని పవన్ సింగ్ అన్నారు. ఇక ఈ ఘటన తర్వాత జనంలో తొక్కిసలాట జరిగగా ఈ సందర్భంగా పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ సంఘటన నాగ్రా ప్రాంతంలోని కవై గ్రామంలో జరిగిందని అంటున్నారు.
Also Read: Nehaa Malik Photos: హోలీకి దిమ్మతిరిగే ట్రీట్ ఇచ్చిన నేహా మాలిక్.. క్లీవేజ్ షోతో హీట్ పెంచేసింది!
Also Read: Andrea Jeremiah Naked: నగ్నంగా మారి వుమెన్స్ డే విషెస్ చెప్పిన ఆండ్రియా.. వైరల్ గా ఫోటో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి