prabhas Adipurush Teaser Trolls  :  ఆదిపురుష్‌ టీజర్ విడుదలైంది. టీజర్ అద్భుతంగానే ఉంది. డార్లింగ్ అభిమానులే కాకుండా అందరినీ మెప్పించేలానే ఉంది. అయితే అనుకున్న స్థాయిలో లేనట్టుగా కనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే.. మొత్తం యానిమేషన్ అన్నట్టుగానే సాగింది. ఒక రూంలోనే షూటింగ్ అంతా చేసేసి గ్రీన్ మ్యాట్‌తో సినిమాను చుట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక అసలే ఇప్పుడు తమిళ ప్రేక్షకులు మన మీద గుర్రుగా ఉన్నారు. వారు అయితే ఈ సినిమాను కొచ్చాడియన్‌తో పోలుస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఓం రౌత్ ఈ సినిమాను షూటింగ్‌ను ఎంత ఫాస్ట్‌గా ముగించాడో అందరికీ తెలిసిందే. షూటింగ్ ముగిసినా కూడా వీఎఫ్‌ఎక్స్ కోసం చాలానే టైం కేటాయించాడు. అంతర్జాతీయ సంస్థలతోనే గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు చేయించాడు. అయితే ఇందులో రియాల్టీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది.  ఏదేదో చేసేసి.. ప్రభాస్‌కు బాడీ తగిలించినట్టుగా.. గ్రాఫిక్స్‌లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పా.. ఒరిజినల్ కాదంటూ జనాలు అంటున్నారు. ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ చానెల్లో చూసినట్టుగా అనిపిస్తోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు


వానర సేన కూడా గొరిల్లాలా కనిపిస్తున్నాయేంటంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఆంజనేయుడు సైతం కొత్తగా, వింతగా కనిపిస్తున్నాడంటూ  ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. కొన్ని షాట్స్ మాత్రం న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి. మ్యూజిక్ అదిరిపోయిందని, విజువల్స్ కూడా రిచ్‌గా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇది యానిమేటెడ్ చిత్రంగానే అనిపిస్తోందంటూ చెబుతున్నారు.


భూమి కుంగినా నేల చీలినా..  న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం..  వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతో నీ పది తలల అన్యాయాన్ని అణిచి వేయడానికి..  ఆగమనం.. అధర్మ విధ్వంసం.. అంటూ రాముడి పాత్రలో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్, ప్రభాస్ విల్లు ఎక్కు పెట్టే షాట్స్ మాత్రం అదిరిపోయాయని అందరూ చెబుతున్నారు. మరి టీజర్ ఇలా చర్చకు దారి తీస్తే.. సంక్రాంతికి సినిమా వస్తే ఇంక ఎలా ఉంటుందో చూడాలి.


ఈ టీజర్‌లో కృతి సనన్ అంతగా హైలెట్ అవ్వలేదు. రావణుడిగా సైఫ్ తన విశ్వరూపాన్ని చూపించేశాడు. ఈ ఇద్దరి మధ్య పోరాట సన్నివేశాలు బాగానే ఉండేట్టు కనిపిస్తోన్నా.. అవి కూడా యానిమేషన్ అనేట్టుగా అనిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో ఈ చిత్రం బాక్సాఫీస్ పని పడుతుందా లేదా అన్నది చూడాలి.


Also Read : Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్ అదుర్స్.. దేవుడిలా కనపించిన ప్రభాస్


Also Read : Adipurush Teaser : నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. సరయు నదిలోంచి ఆదిపురుష్ పోస్టర్?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook