Prabhas Adipurush Trailer ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించిన బజ్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆదిపురుష్‌ నుంచి ట్రైలర్ రాబోతోందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. మే 9న ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నారు. అంతే కాకుండా కొన్ని సెలెక్టెడ్‌ థియేటర్లో త్రీడీ ట్రైలర్‌ను కూడా ప్రదర్శించబోతోన్నారట. ఈ మేరకు అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదిపురుష్ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాను ఈసారి అనుకున్న తేదీకి విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.


అంతే కాకుండా ఆదిపురుష్‌ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మే 9వ తారీకున ట్రైలర్‌ ను భారీ ఎత్తున విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి విడుదల చేయబోతున్నారట. అంతే కాకుండా ట్రైలర్ 3డి స్క్రీనింగ్‌ కూడా రికార్డు స్థాయిలో ఉండబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. 


హిందీతో పాటు తెలుగు లో రూపొందిన ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌ లో పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా విడుదల చేయబోతున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదిపురుష్‌ సినిమా పై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్‌ ఉంటుందనే నమ్మకం ను ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.


టీజర్ విడుదల తర్వాత సినిమా పై రకరకాలుగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమా చిన్న పిల్లల యానిమేషన్ సినిమా అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ఆ కారణంగానే అదనంగా ఆరు నెలల సమయం తీసుకుని వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ను తిరిగి చేయించారనే వార్తలు వచ్చాయి. 


ఆదిపురుష్ ట్రైలర్‌ తో సినిమాపై వచ్చిన ఆ విమర్శలకు సమాధానం చెప్పబోతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా కోట్లాది కన్నులతో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ట్రోల్స్ చేసేందుకు ఒక వర్గం వారు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మే 9న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు ఆనందంను కలిగిస్తున్నాయి. ట్రైలర్‌ విడుదల అయిన తర్వాత సినిమా విడుదల పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.


ఇక సినిమా విడుదల వాయిదా అనేది ఉండక పోవచ్చు.. ట్రైలర్‌ విడుదల తర్వాత మరింత యాక్టివ్‌ గా మేకర్స్ మరియు ప్రభాస్ ఇతర నటీ నటులు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. దాదాపు మూడు లేదా నాలుగు వారాల పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వెయ్యి కోట్ల టార్గెట్‌ తో ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతుంది. మరి ఆ స్థాయిలో సినిమా వసూళ్లు రాబట్టేనా అనేది ట్రైలర్‌ విడుదల తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ


ప్రభాస్ రాముడిగా.. సీత పాత్రలో కృతి సనన్ నటించగా సైఫ్ అలీ ఖాన్‌ ను రావణుడిగా చూపించబోతున్న ఆదిపురుష్ సినిమా లో ఇప్పటి వరకు చూపించని విభిన్నమైన రామాయణంను దర్శకుడు ఓమ్‌ రౌత్‌ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆదిపురుష్‌ విదేశీ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డును సృష్టించాలని మేకర్స్ భావిస్తున్నారు.


Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook