Adipurush in Ott: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆదిపురుష్'(Adipurush). రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్‌ (Kriti Sanon) జానకిగా నటించింది. లక్ష్మణుడి పాత్రలో స‌న్నీసింగ్‌, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్‌ మీడియా సంస్థ విడుదల చేసింది. థియేటర్లలో మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీ కలెక్షన్లను బాగానే రాబట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం, ప్ర‌మోష‌న్స్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఎన్నో అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.  


ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు వచ్చినంత నెగెటివిటీ ఏ మూవీకి రాలేదు. రిలీజ్ కు ముందే ఈ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. డైలాగ్స్ పై విమర్శలు వచ్చాయి. మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై పాటలు, ట్రైలర్‌ ఓ రేంజ్‌లో హైప్‌ తెచ్చిపెట్టాయి. టిక్కెట్‌లు సైతం ఆన్‌లైన్‌లో హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. తీరా రిలీజయ్యాక మెుదటి ఐదు రోజులు బీభత్సం సృష్టించిన కలెక్షన్లు.. ఆ తర్వాత పడిపోయాయి. భారీ ఓపెనింగ్స్ రావడంతో ఈ సినిమా మేకర్స్ పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టలేదనే చెప్పాలి.


Also read: Bholaa Shankar Twitter Review: చిరంజీవి 'భోళాశంకర్' హిట్టా? ఫట్టా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook