Prabhas cameo in Singham Again: బాలీవుడ్ లో రోహిత్ శెట్టి డైరెక్షన్ లో వచ్చిన సింగం ఫ్రాంచైజ్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తాజాగా ఈ ఫ్రాంచైజ్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నెక్స్ట్ సినిమా సింగం ఎగైన్. అజయ్ దేవగన్, అక్షయ్ కపూర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొత్త ఇన్స్టాల్మెంట్ అని మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఉన్న క్యామియో పాత్రల వల్ల సినిమా మీద మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటులు రన్వీర్ సింగ్, దీపికా పడుకొనే, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్,  అర్జున్ కపూర్, వంటి వారు కామియో పాత్రలలో కనిపించనున్న సంగతికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కూడా చిన్న క్యామియో పాత్రలో.. కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజా నిజాలు కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో.. చిత్ర డైరెక్టర్ రోహిత్ శెట్టి ఒక వీడియోని విడుదల చేసి.. దీని గురించి క్లారిటీ ఇచ్చారు. 


"ఈ హీరో లేకుండా సింగం కంప్లీట్ కాదు. దీపావళికి ఈ స్కార్పియో వస్తుంది, తిరుగుతుంది.. కానీ ఎంట్రీ మాత్రం వేరొకరిది ఉంటుంది" అంటూ ఒక స్కార్పియో వీడియోని పోస్ట్ చేశారు రోహిత్ శెట్టి. దానికి కల్కి 2898 AD లోని బుజ్జి థీమ్ ను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గా వాడటం.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 


ఈ నేపథ్యంలో రోహిత్ శెట్టి చెబుతున్నది ప్రభాస్ గురించే అని.. ప్రభాస్ ఈ సినిమాలో క్యామియో పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఈ మధ్య విడుదలైన కల్కి సినిమా బాలీవుడ్ లో కూడా రికార్డుల వర్షం కురిపించింది. ప్రభాస్ కామియో ఈ సినిమాకి కూడా మంచి హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ హీరో సూర్య కూడా చిన్న పాత్రలో కనిపించనున్నారు అని వినికిడి. సింగం సినిమా సూర్య తమిళంలో చేసిన.. సింగం సినిమాకి రీమేక్. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో సూర్య కనిపించడంపై కూడా ఆసక్తి నెలకొంది.


Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు


Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter