Prabhas Vs Chiranjeevi: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. మరోవైపు దీపికా పదుకొణే, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా.. మంచి బజ్ ఉంది. మరోవైపు యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్స్ ద్వారా దాదాపు $3 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ సినిమా తొలిరోజే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించే అవకాశాలున్నాయి. అంతేకాదు ఇప్పటికే యూఎస్ సహా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతూ.. ఈ సినిమా  టికెట్స్ ఓ వారం పాటు భారీగా పెంచుకోవడానిక అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న టికెట్ రేట్స్ భారీగా ఉన్నాయి. దానికి సింగిల్ స్క్రీన్స్ కు 75 రూపాయలు, మల్లీప్లెక్స్ లో రూ. 125 పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా ప్రేక్షకుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారనే పాయింట్ వినబడ్డా.. ఎవరైన ఇష్టముంటే సినిమా చూస్తారు. లేకపోతే లేదు అనే బావన కూడా ఉంది. ఇప్పటికే సెన్సార్ టాక్ ప్రకారం ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా రిపీట్ వాచ్ కాకపోయినా.. ఓ సారి చూసి ఈ విజువల్ ఫీస్ట్ ను ఎంజాయ్ చేయోచ్చు అని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాను 3D ఐ మాక్స్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.


తాజాగా ఆ సంగతి పక్కనపెడితే..చిరంజీవి నటించిన ‘రక్త సింధూరం’ సినిమాలో  కదిలింది.. కదిలింది కల్కి అవతారం అంటూ ఓ పాట ఉంది. అప్పట్లోనే కల్కి పాత్ర గురించి ఈ పాటలో వివరించారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. పోలీస్ ఆఫీసర్ గా,  గండ్ర గొడ్డలి పాత్రల్లో చిరంజీవి ఒదిగిపోయారు. ఆ సినిమాలోని ఈ పాటను మెగాభిమానులు ఇపుడు గుర్తు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి మూవీ కూడా సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఏది ఏమైనా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజే దాదాపు రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. టాక్ పాజిటివ్ గా వస్తే.. ఈ సినిమా కలెక్షన్లు ఆకాశమే హద్దుగా సాగిపోవడం ఖాయం అని చెప్పొచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి