Project k Update : ప్రభాస్ బర్త్ డే.. పెదవి విరుస్తున్న ప్రభాస్ అభిమానులు
Prabhas Birthday Special om Raut Post on Adipurush ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ గురించి ఓం రౌత్ వేసిన ట్వీట్ చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
Project k Superhero Poster : డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవేమీ కూడా అభిమానులను ఖుషీ చేయడం లేదు. వాటిని చూసి తలపట్టుకుంటున్నారు. ఆదిపురుష్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసినట్టుగా బిల్డప్ ఇచ్చారు. కానీ అది టీజర్‌లో ఉన్న షాటే. ఇక ప్రాజెక్ట్ కే నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. అందులో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కానీ ప్రభాస్ మాత్రం కనిపించడం లేదు. హీరోలు పుట్టరు.. తయారవుతారు.. ఎదుగుతారు..అన్నట్టుగా ఇలా ఏదేదో చెప్పుకొచ్చారు.
ప్రాజెక్ట్ కే పోస్టర్ చూస్తుంటే.. ఇందులో ప్రభాస్ ఏదైనా సూపర్ హీరోలా నటించబోతోన్నాడా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఐరన్ మ్యాన్ లాంటి పాత్ర ఏదైనా చేస్తున్నాడా? అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ చేతికి ధరించే షీల్డ్ చూస్తుంటే.. సినిమా మీద మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది.
ఈ పోస్టర్లో ప్రభాస్‌ను చూపించి ఉంటే డార్లింగ్ అభిమానులు కాసింత సంతోషించేవారు. కానీ ఇప్పుడు ఈ పోస్టర్‌ను చూసిన వారు మాత్రం తెగ హర్ట్ అవుతున్నారు. ఈ పోస్టర్‌ను ఏం చేసుకోవాలి.. దీనికి బధులు ఏం అప్డేట్ ఇవ్వకపోయినా బాగుండేది కదా?.. రాత్రి జరిగిన సెలెబ్రేషన్స్‌లోనే దీన్ని చెప్పొచ్చు కదా? దీని కోసం ఇంకో ట్వీట్ వేయాలా? అంటూ వైజయంతీ మీద డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇక ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా సలార్ టీం మీదే ఉన్నాయి. సలార్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా? పోస్టర్‌ను రిలీజ్ చేస్తారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి వారి కల నెరవేరుతుందా? డార్లింగ్ అభిమానులకు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సరైన గిఫ్ట్ వస్తుందా? లేదా? అన్నది చూడాలి.
ప్రభాస్ ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వచ్చేందుకు అవకాశం ఉంది.వచ్చే ఏడాది ఈ టైంకు రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని నిర్మాత అశ్వనీదత్ చెప్పిన సంగత తెలిసిందే.ఈ చిత్రంలో దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిషా పటానీ వంటి బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు.
Also Read : Prabhas బర్త్ డే.. ఆదిపురుష్ అప్డేట్ చూసి ఏడుస్తున్న అభిమానులు
Also Read : Ginna Day 2 Collections : రెండో రోజు లెక్కలివే.. 'సర్దార్' జోరు.. 'జిన్నా' బేజారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook