Salaar: బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రభాస్ కు సలార్ రూపంలో మాంచి కమ్ బ్యాక్ లభించింది. థియేటర్లలో బాగా పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ లో విడుదలైంది. ప్రముఖ ఆన్లైన్ దిగ్గజ  సంస్థ నెట్ ఫిక్స్ లో ఈ చిత్రం జనవరి 19 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ సరికొత్త విషయాన్ని బయటకు తీశారు అభిమానులు. పలు భాషలలో అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్ డైలాగ్స్ చాలా తక్కువ టైం ఉన్నాయి అనేది వారి అభిప్రాయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక్కడ వరకు చెప్పి ఊరుకోకుండా సినిమాలో ఎగ్జాక్ట్ గా ప్రభాస్ డైలాగ్స్ ఎన్ని నిమిషాల పాటు ఉన్నాయి అన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఆన్లైన్ స్ట్రీమింగ్ కావడంతో ప్రభాస్ చెప్పిన డైలాగ్ లు మొత్తం నిడివి ఎంత అనేది కూడా లెక్కించారు. ఈ డైలాగ్స్ అన్నీ కలిపి ఒక అభిమాని ఓ వీడియోని కూడా రూపొందించాడు. ఈ వీడియోలో సలార్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ చెప్పిన అన్ని డైలాగ్స్ పొంది పరిచాడు.


సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోని షేర్ చేసుకున్న అభిమాని తన పోస్టుతో పాటు 'మూడు గంటలకు పైగా ఉన్న సలార్ మూవీలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ నిడివి నాలుగు నిమిషాలు. మధ్యలో గ్యాప్ లు లేకుండా విడివిడి ముక్కలుగా కాకుండా పూర్తి లెంత్ డైలాగ్స్ చెప్పిన సమయం 2 నిమిషాల 35 సెకండ్లు.’అని రాశాడు.


 



సలార్ మూవీ స్పీడ్ లో చాలామంది గమనించలేదు కానీ నిజంగా అతను చెప్పినట్టు ఈ మూవీలో ప్రభాస్ డైలాగ్స్ నిడివి చాలా తక్కువ.


పెద్దగా డైలాగులు లేకపోయినప్పటికీ సినిమాలో అతను చెప్పే ప్రతి మాటకు చాలా డెప్త్..మీనింగ్ ఉంది. పైగా చెప్పింది ప్రభాస్ కాబట్టి ఆ ఇంటెన్సిటీ డిఫరెంట్ గా ఉంది. ఇలా పరిమితమైన డైలాగులు హీరోకి కథాంశాన్ని బేస్ చేసుకుని.. ఎంతో వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్నారు అని కొందరు ఈ విషయాన్ని సమర్ధిస్తున్నారు. డైలాగ్స్ విషయం పక్కన పెడితే మొత్తానికి ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ వీలైనంత త్వరగా వాటిని ఫినిష్ చేసుకొని సలార్ షూటింగ్ లో జాయిన్ అవుతారు.


Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు


Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook