Prabhas Remuneration Hike For Adipurush : సౌత్ నుంచి బాలీవుడ్ లో క్రేజ్ అందుకున్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్‌ సహా  అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి త‌ర్వాత ఆయన చేసిన  సాహో సౌత్‌లో కలెక్షన్స్ విషయంలో ఇబ్బంది పెట్టినా నార్త్ లో మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. దీంతో హిందీలో మార్కెట్ ప‌రంగా ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇక ఈ ఏడాది విడుద‌లైన రాధేశ్యామ్ సినిమా సైతం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయినా  ప్ర‌భాస్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని హిందీ మీడియాలో కధనాలు వైరల్ అయ్యాయి. ఆయన ఆదిపురుష్ సినిమా కోసం రెమ్యునరేషన్ పెంచిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్,  కృతిసనన్ జంటగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా కృతి సీత పాత్రలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ సినిమా రెమ్యునరేషన్ పెంచమని ప్రభాస్ డిమాండ్ చేసినట్టు బాలీవుడ్ మీడియా కధనాలు ప్రచురించింది. ముందు ఈ సినిమాకు 100 కోట్ల దాకా తీసుకుంటానని ప్రభాస్ చెప్పాడని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆదిపురుష్ నిర్మాతల నుంచి ప్రభాస్ రూ.120 కోట్లు కోరుతున్నాడని కథనంలో పేర్కొన్నారు.


ప్రభాస్ దెబ్బతో ఆదిపురుష్ బడ్జెట్ ఒక్కసారిగా 25 శాతం పెరగనుందని,  ఈ పరిస్థితి నిర్మాతలకు ఇబ్బందికరమే అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. అయితే ఇది ప్రచారమే కాగా నిజమయ్యే సూచనలు తక్కువే అని అంటున్నారు. ఎందుకంటే ఒక హీరోకి మొదలు సినిమా కోసం పని చేస్తున్న ఎవరికైనా ఎంత చేల్లిస్తామనే విషయాన్ని నిర్మాణ సంస్థలు ముందుగానే అగ్రిమెంట్లు చేసుకుంటాయి. కానీ ఒక్కోసారి హీరోలు కొంత మొత్తమే డబ్బు తీసుకుని లాభాల్లో వాటా కోరతారు. అలాంటప్పుడు రిస్క్ కూడా ఉంటుంది,  కానీ సినిమా హిట్ అయితే కోట్లు వచ్చి పడతాయి. అయితే ఇలా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా రెమ్యునరేషన్ పెంచడం అనేది నిజం కాకపోవచ్చు అనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ నిజమైతే ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోగా నిలిచిపోనున్నాడు.


ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్,  దీపికా పదుకొనే - అమితాబ్ బచ్చన్‌లతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. అలాగే ఆయన మారుతి డైరెక్షన్లో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో తెలియదు. ఇక ప్రభాస్ మొన్నటి వరకు కొంచెం లావుగా ఉన్నా ఇప్పుడు సన్నపడుతున్నాడు.. అది ఏదైనా సినిమా కోసమా అనే చర్చ కూడా జరుగుతోంది. 


Also Read:Bandla Ganesh: ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి, పోతుంటాయంటూ పూరీకి కొత్త తలనొప్పులు


Also Read:Salman Khan, Chiranjeevi, Venkatesh: చిరంజీవి, వెంకటేష్‌లతో సల్మాన్ ఖాన్ పార్టీ.. హోస్ట్ ఎవరో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook