Kalki 2 Release Date: వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అయితే.. ఈ సినిమాను రెండు భాగాలుగా కల్కి సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఇక ‘కల్కి 2898 AD’ సినిమా సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తైయినట్టు తెలిపారు. అంతేకాదు కొంత ప్యాచ్ వర్క్ గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమా పూర్తి కానున్నట్టు మేకర్స్ తెలిపారు. అంతేకాదు కల్కి 2వ  పార్ట్ ను వచ్చే యేడాది సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటి నుంచే సెకండ్ పార్ట్ కు సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడు నాగ్ అశ్విన్.


కల్కి సెకండ్ పార్ట్ కు ‘కల్కి 3102 BC’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ద్వాపర యుగంలో మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ నిర్యాణంతో ద్వాపరం అంతమైపోతుంది.  మహా భారత యుద్ధంలో ఉప పాండవులపై అస్త్రం ప్రయోగిస్తాడు. దీంతో ఉప పాండవులు చనిపోతారు. అటు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తుడు చనిపోతాడు. శ్రీకృష్ణుడు తన యోగమాయతో మళ్లీ బతికించి కురు వంశాన్ని బతికిస్తాడు.


ఉప పాండవుల మరణానికి కారణమైనఅశ్వత్థామ నుదురుపై ఉన్న శివమణిని పీకిపారిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత 6 వేల యేళ్ల తర్వాత ఈ కథలోకి తీసుకెళ్లాడు నాగ్ అశ్విన్. ఫ్యూచర్ లో వరల్డ్ మొత్తం ఎండ బోతుందో కల్కిలో  చూపించాడు. భూమిపై ఉన్న వనరులను పీల్చేసి కొత్తగా ‘కాంప్లెక్స్’ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాడు సుప్రీమ్ యాస్కిన్. మొత్తంగా సెకండ్ పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర ఉండనుంది. అంతేకాదు మహా భారత యుద్దాన్ని కల్కి లో చూపించడం ఖాయం. మరోవైపు భవిష్య పురాణంలో చెప్పినట్టు కల్కి జననం.. మరియు దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ ఎలా చేస్తాడనేది వెండితెరపై నాగ్ అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడనేది చూడాలి.  మొత్తంగా కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రెండేళ్లకు ఒకసారి ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాడని చెప్పాలి.


Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook