Kalki 2898 AD Overseas Collections: విదేశాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ సునామి.. అక్కడ వసూళ్లు మన దేశ కరెన్సీలో ఎంతంటే.. ?
Kalki 2898 AD Overseas Collections: సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే అదేదో భయపడి కాదు. అలాగే ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడని అతని పని అయిపోందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే మంచి సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది ‘కల్కి 2898 AD’ మూవీతో. అంతేకాదు ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. మన దేశ కరెన్సీలో ఎంత వసూళ్లు రాబట్టిందంటే..
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు.. నార్త్ సౌత్ తేడా లేకుండా విదేశాల్లో ఉన్న భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే దాదాపు $ 5 మిలియన్స్ రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే వరకు ఈ సినిమా నార్త్ అమెరికాలో $ 11 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మన దేశ కరెన్సీలో రూ. 91.81 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
యూకే (ఇంగ్లాండ్) 888,190 పౌండ్స్ రాబట్టింది. రూ. 9.38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆస్ట్రేలియా $ 1,650,603 రాబట్టింది. మన దేశ కరెన్సీలో రూ. 9.18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
న్యూజిలాండ్ $ 184,194 యూఎస్ డాలర్స్ ను రాబట్టింది. మన దేశ కరెన్సీలో రూ. 93.75 లక్షలు వచ్చింది. జర్మనీలో 144,535 పౌండ్స్ రాబట్టింది. మన దేశ కరెన్సీలో రూ. 1.30 కోట్లు రాబట్టింది.
మొత్తంగా కలిపితే.. మన దేశంలో రూ. 112.6 కోట్ల వసూళ్లను రాబట్టింది. మొత్తంగా రూ. 100 కోట్ల పైగా వసూళ్లతో సంచలనం రేపింది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter.