Kalki 2898 AD New Box Office Record: ‘కల్కి 2898 AD’ మూవీ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. భారత దేశంలో ఏ సినిమాకు దక్కని రేర్ ఫీట్..
Kalki 2898 AD New Box Office Record: ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ‘కల్కి’ మూవీ ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అది కలెక్షన్స్ రూపంలో కనపడింది. తాజాగా ఈ సినిమా భారతీయ సినిమాల్లో ఏ సినిమాకు తెగని టికెట్స్ ఒక్క రోజులోనే తెగాయి.
Kalki 2898 AD New Box Office Record: అవును ప్రభాస్ స్క్రీన్ పై కనపడితే చాలు.. ప్రేక్షకులకు పూనకాలు లోడింగ్. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ తో ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న భారీ లెవల్లో విడుదలైంది. అంతేకాదు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం ప్లస్ గా మారింది. మొత్తంగా కాశీ, కాంప్లెక్స్, శంబలా అంటూ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లింది ఈ సినిమా.
తాజాగా ఈ సినిమా బుక్ మై షోలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా బుక్ మై షోలో విడుదలకు నాలుగు రోజులు ముందు 1.7 మిలియన్ టికెట్స్ సోల్డ్ అయిపోయాయి. కానీ రిలీజ్ రోజు ఏ ఒక్కరి ఊహ కందని విధంగా 1.12 మిలియన్ టికెట్ సేల్స్ ను సొంతం చేసుకొంది. ఇప్పటి వరకు బుక్ మై షోలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో రాంపేజ్ చూపించిన దాఖలాలు లేవు.
ఇక పేటీఎం ద్వారా కూడా ఈ సినిమా మంచి బుకింగ్స్ వచ్చాయి. నిన్న నైట్ వర్షం, భారత్, ఇంగ్లాంగ్ సెమీ ఫైనల్ మ్యాచ్ లేకపోయి ఉంటే.. టికెట్ సేల్స్ ఇంకా పెరిగి ఉండేవి. అయినా.. వాటిని తట్టుకొని ఈ సినిమా నిలబడటం గ్రేట్ అని చెప్పాలి. మొత్తంగా మొన్నటి వరకు థియేటర్స్ లో ఈగలు తోలుకుంటూ కూర్చొన్న థియేటర్స్ వాళ్లు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక్క ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ఫస్ట్ డే కలిపితే..దాదపు $6 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తంగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో చూడాలి.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.