Kalki 2898AD OTT: ప్రభాస్ హీరోగా‌. నాగ్ అశ్విన్ దర్శకత్వం.. వహించిన కల్కి సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. విడుదలకి ముందు నుంచి ఈ సినిమాపై.. మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదలైన తర్వాత కూడా ఈ సినిమా.. అంచనాలకు మించి కలెక్షన్లు అందుకుంటూ అభిమానులకి సైతం.. షాక్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విడుదల అయ్యి ఎన్ని రోజులు గడుస్తున్నా.. సినిమా కలెక్షన్లు మాత్రం.. అసలు తగ్గడం లేదు. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల.. గురించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో..హల్ చల్ చేస్తున్నాయి. సినిమా మామూలుగా ఆడినా కూడా ఈమధ్య విడుదల అయిన.. వారం రోజులకే ఓటీటీలలో ప్రత్యక్షమవుతున్నాయి. 


కానీ కల్కి సినిమా.. ఇప్పటికీ భారీగానే కలెక్షన్లు నమోదు చేస్తోంది. దీంతో సినిమా విడుదలయ్యాక.. 7 నుంచి 8 వారాల తర్వాత సినిమాని ఓటీటీలలో విడుదల చేయాలని.. డిసైడ్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ నుంచి ఓటీటీలలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 


ఈ సినిమా హిందీ వర్షన్ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమ్ కాబోతోంది. అయితే అమెజాన్ ప్రైమ్ వారు మాత్రం ఆగస్టు 15న విడుదల చేయగా.. నెక్లెస్ సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నహాలు
చేస్తూ ఉండట. కాబట్టి హిందీ భాషలో మాత్రం ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యేటట్టు.. కనిపిస్తోంది.


ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు.. అందుకుంటున్న ఈ సినిమా.. ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.. అని అభిమానులకు ఎదురుచూస్తున్నారు.


దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి చాలామంది స్టార్లు కీలక పాత్రలో కనిపించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో కామియో పాత్రలలో కనిపించారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్.. ఈ సినిమాని 600 కోట్ల భారీ బడ్జెట్ తో.. నిర్మించారు. సంతోష్ నారాయణ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.


Read more: DSC Aspirants Protest: ఓయూలో హైటెన్షన్.. ఆందోళనకారుల వెంట పడి మరీ అరెస్టులు.. వీడియో వైరల్..


Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి